చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో ఒకే విధమైన, ప్రభావశీల చట్ట రూపకల్పన ప్రక్రియ బలోపేతానికి శాసన సంబంధిత ముసాయిదాను సిద్ధం చేయడం కోసం 36వ బేసిక్ కోర్సు ఆరంభం

నాడు పోస్టు చేయడమైనది: 23 JUL 2026 10:29AM by PIB Hyderabad

శాసన సంబంధిత ముసాయిదాను సిద్ధం చేయడం కోసం ఉద్దేశించిన 36వ బేసిక్ కోర్సును చట్ట, న్యాయ శాఖకు చెందిన శాసన విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ అండ్ రిసర్చ్ (ఐఎల్‌డీఆర్) ఆధ్వర్యంలో 2026 జులై 22న న్యూఢిల్లీ.. కర్తవ్య భవన్-02లో ఆరంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసన విభాగం, చట్ట వ్యవహారాల విభాగ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణితో పాటు అదనపు కార్యదర్శి, ఐఎల్‌డీఆర్ కోర్సు డైరెక్టరు డాక్టర్ మనోజ్ కుమార్ సహా విభాగానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ మణి మాట్లాడుతూ చట్టాలలో స్పష్టతను, స్థిరత్వాన్ని, చట్టపరమైన ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, మరీ ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో శాసన సంబంధ సంస్కరణల కాలంలో ఒకే విధమైన శాసన సంబంధిత ముసాయిదాను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల చట్టాలను ప్రభావవంతమైన రీతిలో అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు.

ఈ కోర్సు ఆరంభ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా.. దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత శిక్షణ, సామర్థ్యాల పెంపుదల కార్యక్రమాలను చేపడుతూ శాసన సంబంధిత ముసాయిదా రచన శక్తిని పటిష్ఠపరచాలన్న లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంటు దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటించినట్లయింది.

ఈ కోర్సును 2026 జులై 22 నుంచి సెప్టెంబరు 25 వరకూ నిర్వహిస్తారు. పదమూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 18 మంది ట్రయినీ ఆఫీసర్లు దీనిలో పాల్గొంటున్నారు. ఆ ట్రయినీ ఆఫీసర్లకు లెజిస్లేటివ్ డ్రాఫ్టింగులో అభ్యాసపూర్వక అనుభవాన్ని అందించడంతో పాటు, లెజిస్లేటివ్ డ్రాఫ్టింగుకు సంబంధించిన సూత్రాలపై అవగాహనను పెంచడం ఈ కోర్సు ముఖ్యోద్దేశం. దీంతో వారు శాసన సంబంధిత ముసాయిదా రూపకల్పనకు అవసరమైన జ్ఞ‌ానాన్నీ, నైపుణ్యాలనూ సంపాదించుకో గలుగుతారు.

ఈ కార్యక్రమ నిర్వహణతో శాసన సంబంధ ముసాయిదా రూపకల్పనలో ఏకరూపతనూ, ఖచ్చితత్వాన్నీ, శ్రేష్ఠత్వ సాధననూ మరింతగా ప్రోత్సహించవచ్చని ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల సంస్థాగత సామర్థ్యాన్ని పటిష్ఠపరచడం కూడా సాధ్యపడుతుందని భావిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2288232) సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada