ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కింలోని నామ్చీలో సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన పీఎం

प्रविष्टि तिथि: 21 JUL 2026 1:01PM by PIB Hyderabad

సిక్కింలోని నామ్చీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తామని శ్రీ మోదీ తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘సిక్కింలోని నామ్చీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి ప్రాణనష్టం జరగడం తీవ్రంగా కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేస్తాం.’’


(रिलीज़ आईडी: 2287139) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Nepali , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali-TR , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam