ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశిష్ట‌ విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండేకి ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 19 JUL 2026 10:55AM by PIB Hyderabad

   విశిష్ట విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. బ్రిటిష్ పాల‌కుల‌పై తిరుగుబాటులో శ్రీ పాండే ప్ర‌ద‌ర్శించిన‌ ధైర్యసాహసాలు భార‌తీయులంద‌రికీ గర్వకారణమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆయన శౌర్యగాథ త‌ర‌త‌రాల‌కూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ మేర‌కు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

“మహా విప్లవకారుడైన శ్రీ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళి. మాతృభూమి గౌరవమర్యాదల ప‌రిర‌క్ష‌ణ కోసం ఆయ‌న సర్వస్వం త్యాగం చేశారు. ఆయ‌న‌ వీరోచిత పోరాట గాథ ఇవాళ కూడా ప్రతి భారతీయుడి మ‌దిలో గ‌ర్వం నింపుతుంది. నిండైన దేశభక్తికి ప్ర‌తీకగా ప్రతి తరానికీ స‌దా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2286422) సందర్శకుల సూచీ సంఖ్య : : 45