ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 JUL 2026 7:13PM by PIB Hyderabad
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోందని శ్రీ మోదీ తెలిపారు.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియాను శ్రీ మోదీ ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదం కారణంగా పలువురు మృతి చెందడం అత్యంత విషాదకరం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.
పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా అందజేస్తాం. @narendramodi
(రిలీజ్ ఐడి: 2286155)
సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam