ప్రధాన మంత్రి కార్యాలయం
విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 JUL 2026 1:51PM by PIB Hyderabad
‘విక్రమ్-1’ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ రోజు స్కైరూట్ బృందంతో మాట్లాడిన ప్రధానమంత్రి, భారత అంతరిక్ష ప్రయాణంలో ఇదొక నిర్ణయాత్మక ఘట్టమని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న మన ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కొత్త అవకాశాలను కల్పిస్తూ, ఆవిష్కరణలను వేగవంతం చేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.
"ఈ విజయం అనేక మంది యువతను మరింత పెద్ద కలలు కనడానికి, నిర్భయంగా ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సహిస్తుంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో మాట్లాడి, విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన సందర్భంలో వారిని అభినందించాను.
ఇది భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక కీలక ఘట్టం. పెరుగుతున్న మన ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కొత్త అవకాశాలను కల్పిస్తూ, ఆవిష్కరణలను వేగవంతం చేస్తోంది.
ఈ విజయం అనేక మంది యువతను పెద్ద కలలు కనడానికి, నిర్భయంగా ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సహిస్తుంది.
@SkyrootA
(రిలీజ్ ఐడి: 2286116)
సందర్శకుల సూచీ సంఖ్య : : 80
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam