జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియన్ బ్రాండ్లు, డిజైనర్లు, నేత కళాకారులు ఇక అంతర్జాతీయం ఇదే మంచి తరుణమన్న మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్

प्रविष्टि तिथि: 16 JUL 2026 8:08PM by PIB Hyderabad

భారతదేశంలో నేడు ఫ్యాషన్దుస్తుల పరిశ్రమ ముఖచిత్రం పూర్తిగా మారిపోతున్నదిసంప్రదాయ తయారీ సామర్థ్యానికి మించి ముందుకు వెళ్తూకొత్త డిజైన్ల ఆవిష్కరలూనాణ్యతసాంస్కృతిక విశిష్టత పరంగా అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తోంది.

 

2025-26లో భారత జౌళిదుస్తుల ఎగుమతులు సుమారు రూ.3.16 లక్షల కోట్లకు చేరుకోగాఈ ఎగుమతుల్ని 2030 కల్లా రూ.9 లక్షల కోట్ల స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారుస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలపరిధిని విస్తరిస్తూ ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లాలనీభారతీయ వాణిజ్య సంస్థలు పటిష్ఠ ఉత్పత్తుల్ని బ్రాండు రూపంలో ఆవిష్కరిస్తూ ఎప్పటికప్పుడు మారే వినియోగదారుల అభిరుచులకూనియంత్రణలకు అనుగుణంగా పోటీ పడే స్వభావాన్ని పెంచుకోవాలనీనాణ్యతను అందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలన్న అంశాల్ని ఈ కార్యక్రమంలో చర్చించారు.

ఈ నేపథ్యంలో, ‘‘భారతీయ బ్రాండ్లుఅంతర్జాతీయ ఆకాంక్షలుసరిహద్దులకు ఆవల రిటైల్ అభివృద్ధికి సరికొత్త రూపును ఇవ్వడం’’ అన్న అంశంపై ఒక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026, జూలై16 నిర్వహించారుడిజైనర్లుఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు ఎలక్ట్రానిక్ వాణిజ్య సంస్థలుతయారీదారు సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారుభారతీయ జౌళిలైఫ్‌స్టైల్ బ్రాండ్లు, సాంప్రదాయిక కళల్నీవారసత్వాన్నీ నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్లలో ఏ విధంగా విస్తరించవచ్చో చర్చించారుఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రముఖ ప్యానలిస్టులు పాలుపంచుకున్నారుభారతీయ బ్రాండ్లకు చెందిన వారులగ్జరీ డిజైనర్లు-కామర్స్ సంస్థలుపీడీఎస్వెల్‌స్పన్ వరల్డ్నెయట్ హోమ్స్పశ్మీనాడాట్‌కామ్ఎక్స్‌పోబజార్ట్రైడెంట్ లకు చెందిన వారుపరిశ్రమ ప్రముఖులు ఉన్నారుభారతీయ బ్రాండ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయేందుకూ, రిటైల్ రంగంలో పోటీపడే తత్వాన్ని అలవరచుకునేందుకూ, నూతన ఆవిష్కరణల సాయంతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు... ప్యానలిస్టులు అనేక సూచనలు చేశారు.
భారతీయ జౌళిదుస్తుల బ్రాండ్ల ప్రతినిధులుడిజైనర్లు-కామర్స్ సంస్థలురిటైల్ వ్యాపారులుఎగుమతిదారులునూతన ఆవిష్కరణల రంగ నిపుణుల్ని ఉద్దేశించి కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రసంగించారుభారత జౌళి రంగ భవిష్యత్తుతో ముడిపడిన స్ఫూర్తిదాయక అభిప్రాయాలను ఈ సందర్భంగా మంత్రి వ్యక్తం చేశారుదేశ విశిష్ట వస్త్ర సంప్రదాయాల్నీసాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ బ్రాండ్లను ఆవిష్కరించడానికి భారతీయ చేతివృత్తి కళాకారులకీడిజైనర్లకీసూక్ష్మ చిన్న మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఈ)కీ అపార అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లలో విజయాన్ని చేజిక్కించుకోవడానికి భారతీయ బ్రాండ్లు రాశితో పాటు వాసిస్థిరత్వంవిస్తరణపై దృష్టిని కేంద్రీకరించాలని మంత్రి సూచించారు. ‘‘చేతివృత్తి కళాకారులు భారత్‌కు పెన్నిధి’’ అని మంత్రి వ్యాఖ్యానించారుభారతదేశ జౌళి రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థకు కీలకం చేతివృత్తి కళాకారులూచేనేత కార్మికులేనని ఆయన పునరుద్ఘాటించారుచేతివృత్తి కళాకారుల పనితనాన్ని లోకానికి చాటడంవారిని అంతర్జాతీయ కొనుగోలు సంస్థలతో అనుసంధానించడంభారత ఘన జౌళి వారసత్వాన్ని పరిరక్షించడంలో ‘భారత్ టెక్స్ 2026’ వంటి కార్యక్రమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు.
నాణ్యతస్థిరత్వంఘన వారసత్వాలుకళాకౌశలం సాయంతో భారతీయ బ్రాండ్లు తమ అంతర్జాతీయ ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటూ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని జోడించడానికి ఇది అనువైన తరుణమని మంత్రి అన్నారుప్రపంచ వ్యాప్తంగా ఆదరణకు నోచుకొనేట్టు భారత విశిష్ట హస్తకళల వారసత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారుతయారీ సంస్థలుచేతివృత్తి కళాకారులుచేనేతదారులు భారత్‌కున్న అత్యంత గొప్ప బలమని ఆయన చెబుతూజౌళి రంగంలో సమ్మిళిత అభివృద్ధితో పాటు ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగిన అభివృద్ధిని సాధించాలంటే అందుకు చేతివృత్తి కళాకారులకీచేనేతదారులకీ సాధికారతను కల్పించడం ఎంతో అవసరమని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు.

భారతీయ బ్రాండ్లకుహస్తకళలకూ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోందని ప్రసిద్ధ భారతీయ డిజైనర్లు వైశాలీ షడంగులేశ్రీ రాహుల్ మిశ్రా అన్నారుకేవలం నాలుగు చేనేత కుటుంబాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లుఈ ప్రస్థానం ప్రస్తుతం ఒక పెద్ద సమాజంగా మారినట్లుచేనేత సిబ్బందిలో 90 శాతానికి పైగా యువతులే ఉన్నట్లు వైశాలీ షడంగులే చెప్పారుతాము సాంప్రదాయిక కళలను సంరక్షిస్తూనే సుస్థిర జీవనోపాధిని పొందుతున్నట్లు ఆమె తెలిపారుభారత్‌కు చెందినఅంతరించిపోయిన 100 నేత సంప్రదాయాల్ని పునరుద్ధరించాలన్నదే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘మీరు అంతర్జాతీయ మార్కెట్టులో మీదైన గుర్తింపును పొందాలనుకుంటుంటేభారతీయ చేనేతల విశిష్టతలతో పాటు వాటికి ఉన్న శక్తిని ప్రపంచం ఎదుట ఆవిష్కరించాలి’’ అని వైశాలీ షడంగులే అన్నారుఏదైనా ఒక బ్రాండుకు ఉండే అతి పెద్ద బలం ఆ బ్రాండుకు ఉన్న ప్రామాణిక సమాచారాన్ని తెలియజేయడమేనని జైపూర్ రగ్స్ వ్యవస్థాపకుడు శ్రీ నంద్ కిశోర్ చౌదరీ అన్నారుఒక బ్రాండు తన మూలాలూసంప్రదాయాలూవారసత్వంతో బలంగా పెనవేసుకొన్నప్పుడు దానిని అనుకరించడం పోటీ సంస్థలకు కష్టం అవుతుందని ఆయన వివరించారు.

 

స్వదేశీ హస్తకళలను పెంచి పోషించుకోవాలని శ్రీ రాహుల్ మిశ్రా అన్నారు. ‘‘ప్రతి దేశానికీ సరిపడేట్టు డిజైన్లలో మార్పుచేర్పులు చేసే బదులుభారతీయత ఉట్టిపడే కళాత్మకకే కట్టుబడి ఉండటంపై దృష్టి పెట్టాలిమౌలికత్వాన్నీప్రామాణికతనీ కాపాడుకోవడానికి శ్రద్ధ తీసుకోవాలి.. ఈ ప్రామాణికత్వమే భారతీయ బ్రాండుల గొప్పతనం’’ అని ఆయన అన్నారు. ‘‘చేతులతో తయారు చేసిన వస్తువులూచేనేతలే భారత్ ఆత్మకు ప్రతీకప్రత్యేకించి ఈ కృత్రిమ మేధ కాలంలో వీటి ప్రాధాన్యం మరింతగా పెరిగిపోతుంది’’ అని కూడా ఆయన వివరించారు.
అంతర్జాతీయ స్థాయి వాణిజ్య కార్యకలాపాలకు మార్కెట్లూబహుళ విధ అమ్మకాలకు తోడ్పడే వ్యూహాలూ కీలకంగా మారాయని ఈ-కామర్స్ రంగ ప్రముఖులు అన్నారువాణిజ్య కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి చాలా కాలం పడుతుందనీకానీ ఒక సారి ఈ లక్ష్యాన్ని చేరుకొంటే దీనికి దీర్ఘకాలిక స్థిరత్వంతో పాటు నిరంతర అభివృద్ధి కూడా నిర్ధారితం అవుతుందనీ వారు చెప్పారుఅమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కంట్రీ హెడ్ శ్రీనిధి కల్వపూడి మాట్లాడుతూ తమ సంస్థ లక్షల కన్నా ఎక్కువ మంది అమ్మకందారులకు తోడ్పాటును అందిస్తోందన్నారువారిలో  రెండో అంచెమూడో అంచె నగరాలకు చెందిన చేతివృత్తుల వారు చాలా మంది ఉన్నారని తెలిపారుబ్రాండును తీర్చిదిద్దడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆమె చెబుతూ, ‘‘భారత్ మరిన్ని ఎగుమతులు చేయడానికి తోడుఅంతర్జాతీయ స్థాయిలో దీర్ఘకాలం పాటు గుర్తుపెట్టుకొనే విధంగా ఖ్యాతిని కూడా సంపాదించుకోవాలి’’ అని అన్నారు. ‘‘బ్రాండ్లను రూపొందించడం ఇప్పుడు కేవలం ఒక ఐచ్ఛికం కాదు.. మనుగడలో ఉండాలంటే తప్పక చేయవలసిన పనిగా మారిపోయింది’’ అని శ్రీనిధి కల్వపూడి స్పష్టం చేశారు.  సాంకేతికత పోషించే పాత్రడేటాఏఐప్రాంతీయ భాషల్లోనూ ఏఐ ఆధారిత సేవల్ని వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాల్ని గురించి వక్తలు ప్రస్తావించారువిశ్వసనీయతా ప్రమాణచిహ్నంనమూనా లాజిస్టిక్స్ సహకారంబిజినెస్-టు-కన్స్యూమర్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలతో భారతీయ బ్రాండులను అంతర్జాతీయ స్థాయికి విస్తరించవచ్చని వారు అన్నారు.
భారత ఉత్పాదన రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థనీసరఫరా వ్యవస్థల్నీఅంతర్జాతీయ స్థాయిలో పోటీపడే తత్వాన్నీ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని భారీ స్థాయి తయారీదారు సంస్థల ప్రతినిధులు ప్రస్తావించారుక్లస్టర్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుకార్పొరేట్పరిశ్రమ వ్యవహారాల అధిపతి డాక్టర్ అనిల్ రాజ్‌వంశీ ప్రశంసించారుఏకీక‌ృత తయారీ విస్తారిత అనుబంధ వ్యవస్థ భారతీయ బ్రాండ్లకు ఎక్కువగా ఉత్పత్తి చేయగల స్తోమతనీదక్షతనీ అందించగలదని ఆయన అన్నారు.  ట్రెంట్ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ వెంకటేశాలు పళనిస్వామి మాట్లాడుతూభారత్ తన విలువని సృష్టించే మార్గంలో ప్రతి ఒక్క అంచెలో అధిక పారదర్శకత్వాన్నీవేగాన్నీ నిర్ధారించుకుంటూ జౌళి రంగానికి బలమైన అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకోవాల్సి ఉందన్నారుఅలాంటి గుర్తింపునకు మంచి నాణ్యతచెప్పిన సమయానికి సరకును అందించేటట్లు చూడడంతో పాటు నిరంతరాయ ప్రాతిపదికన సేవల లభ్యత.. ఇవి పునాదిగా నిలవాలన్నారుభారత్ కీలక బలాల్లో ఒకటైన పత్తిని శుద్ధిపరిచిబ్రాండుగా తీర్చిదిద్దే పనులు విదేశాల్లో ఎందుకు జరగాలని కూడా వక్తలు ప్రశ్నించారునాస్‌కామ్‌లాంటి ఒక కేంద్రీయ సంస్థను ఏర్పాటు చేయాలనీఅది అంతర్జాతీయ బ్రాండును రూపొందించడానికి పరిశ్రమకు మొదటి దశ నుంచి చివరి దశ వరకూ సంపూర్ణ సహకారాన్ని అందించే స్థితిలో ఉండాలనీ వారు అభిప్రాయపడ్డారుఅంతర్జాతీయ మార్కెట్ల వరకూ చేరుకోవాలంటే దీర్ఘకాలిక అభివృద్ధి ఒక ముఖ్య ఆధారంగా మారిందనీపెద్ద ఎగుమతిదారు సంస్థలకూడిజైనర్లకూ మధ్య సహకారం పుంజుకొనేట్టు చేస్తే ఉత్పాదన స్తోమతకీసృజనశీలత్వానికీ మధ్య ప్రభావపూర్వక సమన్వయాన్ని ఏర్పరచవచ్చనీ సూచించారు.
ఈ అభిప్రాయాలను కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారులు సమర్ధించారుభారత్ ఎక్కువ పరిమాణంలో ఉత్పాదనలను విక్రయించడం ఒక్కటే కాకుండాశ్రేష్ఠమైన నాణ్యతను కూడా అందిస్తోందని ఐటీపీఓ చైర్మన్ శ్రీ జావేద్ అశ్రఫ్ అన్నారు. ‘భారత్‌లో తయారీ’ అనే గుర్తింపు.. ఉన్నత ప్రమాణాలు కలిగిన నాణ్యతకు మారుపేరుగా నిలవాలనీప్రదర్శనలు ఎమ్ఎస్ఎమ్ఈలకు నేటికీ కీలక అవకాశాలుగా కొనసాగుతున్నాయనీ ఆయన అన్నారుజౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలమ్ శమీ రావు మాట్లాడుతూ శక్తిమంతమైన డిజైనర్ హౌసులూఉమ్మడి ప్రాతిపదికన వినియోగించుకోదగ్గ మౌలిక సదుపాయాలు-కామర్స్ సంస్థల సేవలను వినియోగించుకొనే పరిస్థితీ చాలా ముఖ్యమని సూచించారుబ్రాండును రూపొందించడం ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అని ఆమె అన్నారు.
భారతీయ బ్రాండ్లను విశ్వసనీయమైనవిగానూఅధిక నాణ్యత కలిగినవిగానూఅంతర్జాతీయంగా గుర్తించదగిన బ్రాండ్లుగానూ నిలపాలంటే ప్రభుత్వానికీపరిశ్రమకీ మధ్య ఇప్పటితో పోలిస్తే మరింత ఎక్కువ సహకారం అవసరమని కార్యక్రమం చివర్లో పిలుపునిచ్చారుఈ ప్రయాణంలో భారతీయ హస్తకళలకు మరింత వ్యాప్తిని సమకూర్చడానికీక్లస్టర్ అభివృద్ధిని బలోపేతం చేయడానికీప్రామాణిక సమాచారాన్ని అందించడానికీనాణ్యమైన కంటెంటును రూపొందించడానికీ  కృషి చేయాలని సూచించారు.

 

***


(रिलीज़ आईडी: 2285754) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Gujarati , Tamil