ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఒడిశా, జార్ఖండ్‌లో నాలుగు జిల్లాలను చుట్టివచ్చే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్కులో సుమారు 145 కి.మీ. మేర విస్తరణకు అవకాశం
ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.3,907 కోట్లు.. 2030-31 కల్లా పూర్తి
प्रविष्टि तिथि:
15 JUL 2026 3:40PM by PIB Hyderabad
దాదాపు రూ.3,907 కోట్లు ఖర్చయ్యే రెండు రైల్వే శాఖ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో
1.పారాదీప్-హరిదాస్‌పూర్.. డబ్లింగ్
2. రాజ్‌ఖర్‌సావాన్-డాంగోఅపోసీ.. నాలుగో లైను భాగంగా ఉన్నాయి.
లైన్ సామర్థ్యం పెరగడంతో రాకపోకలు చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడతాయి. ఫలితంగా భారతీయ రైల్వేల కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యంతో పాటు సేవల విశ్వసనీయత కూడా పెరుగుతుంది. ఈ బహు-మార్గాల ప్రతిపాదనలు కార్యకలాపాల నిర్వహణను సువ్యవస్థీకరించడమే కాకుండా రద్దీని తగ్గించడానికి కూడా దోహదపడతాయి. ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘న్యూ ఇండియా’ దృష్టికోణానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధిపరచి, ఈ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి సహకరించడం వీటి లక్ష్యం. ఈ నేపథ్యంలో ఉద్యోగకల్పన, స్వయంఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఈ ప్రాజెక్టులను ‘పీఎమ్-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’లో భాగంగా చేపడతారు. ఏకీకృత పథకరచనతో పాటు ఆసక్తిదారులను సంప్రదించి బహు-మార్గాలతో కూడిన అనుసంధానాన్నీ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్) సామర్థ్యాన్నీ పెంచాలన్నది ఈ ప్రాజెక్టుల ముఖ్యోద్దేశం. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే ప్రజల, వస్తుసేవలకు నిరంతరాయ అనుసంధాన సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 4 జిల్లాలకు ప్రయోజనం కలిగించే 2 ప్రాజెక్టులతో భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్ సుమారు 145 కి.మీ. మేర విస్తరించనుంది.
ప్రతిపాదిత బహు-మార్గాల ప్రాజెక్టు దాదాపు 1,526 గ్రామాలకు అనుసంధానాన్ని పెంపొందిస్తుంది. ఈ గ్రామాల్లో ఇంచుమించు 14 లక్షల జనాభా ఉంది.
ప్రతిపాదిత సామర్థ్య వృద్ధితో దేశమంతటా లలిత్‌గిరి బౌద్ధ సముదాయం, శ్రీ బల్‌దేవ్‌జేవ్ ఆలయం, మేఘాహాతుబురు పర్వతాలు సహా అనేక ప్రధాన పర్యాటక ప్రదేశాలకు రైల్వే అనుసంధానం మెరుగుపడుతుంది.
బొగ్గు, ఇనుప ఖనిజం, డోలమైటు, సున్నపురాయి, జిప్సమ్ వంటి ముడి ఖనిజాల రవాణాకు ప్రతిపాదించిన ప్రాజెక్టులు చాలా అవసరం. సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాల వల్ల ఏటా 44 మిలియన్ టన్నుల సరకు రవాణా సంబంధిత అదనపు సామర్థ్యం లభిస్తుంది. రైల్వేలు పర్యావరణానుకూల, ఇంధన ఆదాకు దోహదపడే రవాణా సాధనం కావడం వల్ల వాతావరణ లక్ష్యాల్ని సాధించడానికీ, దేశానికి సరకు రవాణా కయ్యే ఖర్చును తగ్గించడానికీ తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టులు చమురు దిగుమతిని (6 కోట్ల లీటర్లు) తగ్గిస్తాయి. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్ని (29 కోట్ల కిలోలు) కూడా తగ్గిస్తాయి. ఇది ఒక కోటి మొక్కలను సంరక్షించడంతో సమానం.
***
(रिलीज़ आईडी: 2284914)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam