ప్రధాన మంత్రి కార్యాలయం
ఖతార్ దేశ 'ఫాదర్ అమీర్' షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్‌థానీ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
12 JUL 2026 3:20PM by PIB Hyderabad
ఖతార్ దేశ ‘ఫాదర్ అమీర్’ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్‌థానీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఖతార్ దేశాన్ని అద్భుతమైన అభివృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించిన ఒక దూరదృష్టి గల నాయకుడిగా ఆయనను ప్రధానమంత్రి అభివర్ణించారు. 2024 ఫిబ్రవరిలో తాను ఖతార్‌లో పర్యటించినప్పుడు ఆయనను కలిసే భాగ్యం కలిగిందని పేర్కొన్న ప్రధాని.. ఆయనను ఒక నిజమైన మిత్రుడిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీకి, మొత్తం రాజ కుటుంబానికి, ఖతార్ ప్రజలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“ఖతార్ దేశ ‘ఫాదర్ అమీర్’ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్‌థానీ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఖతార్‌ను అద్భుతమైన అభివృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించిన ఒక దూరదృష్టి గల నాయకుడిగా ఆయనను స్మరించుకుంటూ 2024 ఫిబ్రవరిలో నేను ఖతార్‌లో పర్యటించినప్పుడు కలిసిన ఒక నిజమైన మిత్రుడిగా కూడా ఆయనను గుర్తు చేసుకుంటున్నాను. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి, మొత్తం రాజకుటుంబానికి, ఖతార్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దివంగత నాయకుడి ఆత్మకు శాశ్వతమైన శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.”
***
(రిలీజ్ ఐడి: 2283930)
సందర్శకుల సూచీ సంఖ్య : : 63
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam