కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఆమ్నెస్టీ పథకం కోసం ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఈపీఎఫ్‌వో
प्रविष्टि तिथि:
12 JUL 2026 9:35AM by PIB Hyderabad
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఆమ్నెస్టీ పథకం-2026ను ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం గుర్తింపు పొందిన మినహాయింపు ఉన్న ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులను నిర్వహిస్తున్న సంస్థలు క్రమబద్ధీకరణ కోసం ఈ పథకం ద్వారా ఒక అవకాశం అవకాశం లభిస్తుంది. ఆరు నెలల పాటు అందుబాటులో ఉండే ఈ పథకాన్ని యజమానులు, భాగస్వాములు, సాధారణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించడమైనది.
ఫైనాన్స్ చట్టం-2026... గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్‌లను నియంత్రించే ఆదాయపు పన్ను విధానాన్ని, ‘ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం-1952’ సంబంధిత చట్టబద్ధమైన, పరిపాలనా నిబంధనలకు అనుగుణంగా మార్చింది. ‘ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం-1952’లోని సెక్షన్ 17 కింద మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్‌లకు మాత్రమే ‘ఆదాయపు పన్ను చట్టం-2025’ కింద గుర్తింపు అందుబాటులో ఉంటుంది. అటువంటి సంస్థలకు ఈ చట్టంలోని సెక్షన్ 17, సామాజిక భద్రత నియమావళి-2020లోని సెక్షన్ 143 కింద గతకాలానికి వర్తించే విధంగా ఆమ్నెస్టీ మంజూరు చేస్తారు.
ఆమ్నెస్టీ పథకానికి వర్తింపు
ఆదాయపు పన్ను చట్టం-1961 కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్‌ను నిర్వహిస్తూ... సంబంధిత ప్రభుత్వం నుంచి అంటే సందర్భానుసారంగా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక మినహాయింపు నోటిఫికేషన్‌ను కలిగి లేని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.
పథకం చెల్లుబాటు కాలం
కాలవ్యవధి: ఈ పథకం నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరు (6) నెలల కాలానికి చెల్లుబాటులో ఉంటుంది. 29 జూన్, 2026న ఈ పథకాన్ని నోటిఫై చేశారు.
అర్హత గల సంస్థలు
కేటగిరీ–I: గతకాలపు ట్రస్ట్ క్రమబద్ధీకరణను కోరుతున్న సంస్థలు... అంటే ఇప్పటికే పీఎఫ్ చెల్లింపులు, చట్టబద్ధమైన రిటర్నుల దాఖలు మొదలైన వాటి కోసం ఈపీఎఫ్‌వో నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న సంస్థలు లేదా భవిష్యత్తులో నిబంధనలను పాటించుటను ఎంచుకున్న సంస్థలు.
కేటగిరీ–II: సామాజిక భద్రతా నియమావళి-2020 ప్రకారం వారి ప్రైవేట్ పీఎఫ్ ట్రస్టులను నడుపుతూనే, వారి గత హోదాను అధికారికంగా చట్టబద్ధం చేసుకోవాలని కోరుకునే సంస్థలు.
అందించే కీలక ప్రయోజనాలు, ఉపశమనాలు
రెట్రోస్పెక్టివ్ క్రమబద్ధీకరణ: ట్రస్ట్ ప్రారంభం నుంచి నిర్దేశిత కటాఫ్ తేదీ వరకు మినహాయింపు హోదాను, ట్రస్ట్ గుర్తింపును మంజూరు చేస్తారు.
సామాజిక భద్రత నియమావళి-2020 కింద నిబంధనల మినహాయింపు: కనీస ఉద్యోగుల సంఖ్య, అవసరమైన కార్పస్ పరిమాణాలు, 3 సంవత్సరాల మునుపటి నిబంధనల పాటింపు రికార్డులు వంటి కఠిన నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది.
చట్టపరమైన చర్యల రద్దు: సభ్యుల ఖాతాలు చట్టబద్ధమైన రేట్లకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ రేట్లతో వడ్డీ, వాటాలను పొందినట్లయితే... బకాయిలు, నష్టపరిహారాలు, వడ్డీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అసెస్‌మెంట్‌లను ఉపసంహరిస్తారు. రద్దు చేస్తారు. గతంలో ఖరారు చేసిన ఉత్తర్వులను మొదటి నుంచీ చెల్లనివిగా పరిగణిస్తారు.
యజమాని తప్పనిసరి బాధ్యతలు:
దరఖాస్తు: అర్హత గల సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఉద్దేశించిన అధికారిక దరఖాస్తును సమర్పించాలి. ఈ దరఖాస్తులను సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా సమర్పించవచ్చు. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి తమ సుముఖతను తెలియజేస్తూ ఒక ఆసక్తి వ్యక్తీకరణనూ rc.exemption@epfindia.gov.in అనే ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు.
చట్టబద్ధమైన ఆడిట్: ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నీ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయించాలి. ఈపీఎఫ్‌వో ప్రత్యేక/చట్టబద్ధమైన ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినప్పుడు, దరఖాస్తు చేసిన 3 నెలల్లోపు దానిని అధికారికంగా పూర్తి చేయాలి.
మార్గదర్శనం, మద్దతు
ఈ ఆమ్నెస్టీ పథకానికి సంబంధించిన వివరాల కోసం, 29.06.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ జీఎస్ఆర్ 525(E) ద్వారా జారీ చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం-2026 అనుబంధంలోని భాగము Cని చూడవచ్చు. అదనంగా, సర్క్యులర్, ఎస్‌వోపీ మొదలైన వాటిలో పేర్కొన్న వివరణాత్మక విధానం కోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌నూ చూడవచ్చు.
ఈపీఎఫ్‌వో అధికార పరిధిలోని ప్రాంతీయ కార్యాలయం అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. సంస్థల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ప్రాసెస్ చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2283823)
आगंतुक पटल : 5