బొగ్గు మంత్రిత్వ శాఖ
రూ. 37,500 కోట్ల ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
08 JUL 2026 7:25PM by PIB Hyderabad
13 మే 2026న రూ. 37,500 కోట్ల ఆర్థిక వ్యయంతో ప్రభుత్వం ఆమోదించిన ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ పథకం ద్వారా బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల విస్తరణ వేగవంతం కానుంది. బొగ్గు ఆధారిత ఉత్పత్తులకు అదనపు విలువను చేకూర్చడం, విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంధన, రసాయన రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యానికి ఈ నిర్ణయం ఊతమివ్వనుంది.
పథకం ఆమోదం పొందిన తర్వాత దానికి సంబంధించిన మార్గదర్శకాలను 25 జూన్ 2026న ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని అనుసరిస్తూ 7 జూలై 2026న ప్రతిపాదనల కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ) పత్రాన్ని కూడా ప్రకటించింది. దీని ద్వారా అర్హులైన దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా ఆహ్వానిస్తోంది.
భాగస్వాముల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి, పథకం నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ 20 జూలై 2026న ముందస్తు అవగాహన సమావేశాన్ని నిర్వహించనుంది. ఆసక్తి గల దరఖాస్తుదారులు, ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరింది.
దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 7 సెప్టెంబర్ 2026.
పథకం మార్గదర్శకాలు, ప్రతిపాదనల కోసం అభ్యర్థన, వివరణాత్మక దరఖాస్తు కాలపట్టిక బొగ్గు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల సంస్థలు ఈ పత్రాలను పరిశీలించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2282702)
సందర్శకుల సూచీ సంఖ్య : : 53