జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చేనేత రంగంలో ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించేందుకు ‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం


ఆగస్టు 1, 2026న వైభవంగా ముగింపు వేడుక... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు 20 జూలై చివరి తేదీ

प्रविष्टि तिथि: 08 JUL 2026 11:07AM by PIB Hyderabad

భారతదేశ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని అభివృద్ధి కమిషనర్ (చేనేత) కార్యాలయం హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026-‘‘వీవింగ్ ఇన్నోవేషన్’’ పేరుతో ఒక జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. సాంకేతికతసరికొత్త డిజైన్లుపారిశ్రామిక నైపుణ్యంపర్యావరణ హిత పరిష్కారాలను చేనేత రంగానికి అనుసంధానించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ హ్యాకథాన్ ముగింపు వేడుక (గ్రాండ్ ఫినాలే) ఆగస్టు 12026న ఐఐటీ ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (ఎఫ్ఐటీటీ) వేదికగా జరగనుంది. ప్రాథమిక పరిశీలనలో ఎంపికైన జట్లు తమ ఆలోచనలనుపరిష్కారాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. విద్యా రంగంపరిశ్రమలుడిజైన్సాంకేతికతచేనేత రంగ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి జ్యూరీ ఈ ప్రదర్శనలను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. 

ఈ కార్యక్రమం గురించి కేంద్ర జౌళి శాఖ చేనేత విభాగం అభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఎం బీనా మాట్లాడుతూ... 

‘‘భారతీయ యువత సృజనాత్మకతనుచేనేత రంగ సంప్రదాయ వారసత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ముఖ్య ఉద్దేశం. నేత కార్మికులువిద్యార్థులుడిజైనర్లుసాంకేతిక నిపుణులువ్యాపారవేత్తలుఆవిష్కర్తలు కలిసికట్టుగా పనిచేసేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుంది. చేనేత రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను అధిగమించడానికిఅంతర్జాతీయ పోటీని తట్టుకోవడానికిఈ రంగం స్థిరమైన వృద్ధి సాధించడానికి అవసరమైన ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం’’.

చేనేత రంగానికి సంబంధించిన విస్తృతమైన అంశాల్లో వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించేలా ఈ హ్యాకథాన్‌ను రూపొందించారు. ఉత్పత్తిడిజైన్ ఆవిష్కరణలసుస్థిరతసర్క్యులారిటీడిజిటల్ సాంకేతికతమార్కెట్ అవకాశాలుబ్రాండింగ్సరఫరా వ్యవస్థ  సమర్థతఉత్పాదకత పెంపువ్యాపార వృద్ధిసామాజిక ప్రభావం వంటి పలు అంశాలపై ఇందులో ప్రధానంగా దృష్టి పెడతారు. 

సంప్రదాయ చేనేత రంగాన్ని దేశ ఆధునిక అంకుర సంస్థల వ్యవస్థతో మరింత బలోపేతంగా అనుసంధానించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విభిన్న రంగాల నిపుణులు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. 

ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు విభిన్న రంగాల వారికి అవకాశం కల్పించారు. జైళిఫ్యాషన్డిజైన్ఇంజనీరింగ్మేనేజ్‌మెంట్సాంకేతికత విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితో పాటు చేనేత కార్మికులుకళాకారులుపరిశోధకులుఅంకుర సంస్థలుపారిశ్రామికవేత్తలుఆవిష్కర్తలురకరకాల నిపుణులు ఈ సవాల్‌లో భాగస్వాములు అయ్యేందుకు అర్హులు. 

ఈ హ్యాకథాన్ కేవలం ఉత్తమ ఆలోచనలను గుర్తించడానికే పరిమితం కాలేదు. నిజ జీవితంలో అమలు చేయడానికి వీలుగా ఉండే అచరణీయమైన పరిష్కారాలను ఇది ఎంపిక చేస్తుంది. భాగస్వామ్య సంస్థల సహకారంతో వీటికి మార్గదర్శకత్వంఇంక్యుబేషన్తదుపరి అభివృద్ధికి అవసరమైన పూర్తి మద్దతును అందిస్తారు. చేనేత రంగాన్ని ఆధునీకరించడంఅంతర్జాతీయ పోటీకి సిద్ధం చేయడందీర్ఘకాలిక మనుగడ సాగించేలా వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. 

ఈ పోటీలో పాల్గొనడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూలై 202026 వరకు తెరిచి ఉంటాయి. విద్యార్థులుఆవిష్కర్తలుఅంకుర సంస్థలుపరిశోధకులుడిజైనర్లుపారిశ్రామికవేత్తలుచేనేత నిపుణులు తమ వినూత్న ఆలోచనలను www.youthideathon.in/handloom వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 

సాంకేతికంగా బలోపేతమైనపర్యావరణ హితమైనఅంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకోగల భారతీయ చేనేత రంగం కోసం ప్రతిభావంతులంతా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనాలని అభివృద్ధి కమిషనర్ (చేనేత) కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చేందుకు విద్యార్థులుఆవిష్కర్తలుడిజైనర్లుపారిశ్రామికవేత్తలుపరిశోధకులుఅంకుర సంస్థలుచేనేత నిపుణులు తమ వంతు కృషి చేయాలని కోరింది. 

భారత ప్రభుత్వ జైళి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ కార్యాలయం దేశంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రచారంఅభివృద్ధికార్మికుల సంక్షేమాన్ని నిర్వహించే అత్యున్నత సంస్థ. ప్రభుత్వ విధానాల రూపకల్పనఅభివృద్ధి కార్యక్రమాలుమార్కెటింగ్ ప్రోత్సాహకసంస్థాగత మద్దతు ద్వారా భారతీయ చేనేత వస్త్రాల పోటీతత్వాన్ని పెంచడానికి ఇది నిరంతరం కృషి చేస్తుంది. నేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ.. దేశ సంపన్న నేత సంప్రదాయాలనుసాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

***


(रिलीज़ आईडी: 2282457) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam