పార్లమెంటరీ వ్యవహారాలు
‘విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు 17వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-25’ బహుమతుల పంపిణీ కార్యక్రమం
प्रविष्टि तिथि:
06 JUL 2026 12:21PM by PIB Hyderabad
‘విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు 17వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-25’ బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని 2026 జులై 7వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీ పార్లమెంట్ భవన సముదాయంలో గల పార్లమెంట్ గ్రంథాలయ భవనం జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి కేంద్ర చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధ్యక్షత వహిస్తారు. పోటీలో ప్రతిభావంతమైన ప్రదర్శనకు గాను బహుమతులను గెలుచుకున్న విద్యార్థులతో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు బముమతులను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీరుకు చెందిన కాశ్మీర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు యువజన పార్లమెంటు సమావేశాలను మరోసారి ప్రదర్శిస్తారు. వీరు విశ్వవిద్యాలయాలు, కళాశాలల 17వ ‘జాతీయ యువజన పార్లమెంటు పోటీ’ 2024-25లో మొదటి స్థానంలో నిలిచారు.
‘విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు యువజన పార్లమెంటు పోటీల’ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ శ్రేణిలో యువజన విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు యువజన పార్లమెంటు పోటీ పథకంలో భాగంగా 17వ పోటీని దేశంలో 51 యువజన విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు నిర్వహించారు.
యువతరంలో స్వీయ క్రమశిక్షణను, భిన్నాభిప్రాయాల పట్ల సహనం కలిగి ఉండటాన్ని, ఆలోచనలను నిష్పక్షపాతంతో వ్యక్తం చేయడాన్ని, ప్రజాస్వామిక జీవిత శైలికి సంబంధించిన ఇతర గుణాలను అలవరచడానికి ఉద్దేశించిందే ఈ యువజన పార్లమెంటు పథకం. దీనికి తోడు, ఈ పథకం విద్యార్థుల్లో పార్లమెంటు కార్య ప్రణాళిక, పద్ధతులు, చర్చలు, వాదోపవాదాల మెలకువలపై అవగాహనను కల్పిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం, ధాటిగా మాట్లాడే కళను పెంపొందింప చేస్తుంది.
పోటీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఇచ్చే ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయీ రన్నింగ్ పార్లమెంటరీ షీల్డు’’ను ఇస్తారు. ఈ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్‌లోని కాశ్మీర్ విశ్వవిద్యాలయానికి ఇస్తారు. దీనికి తోడు, గ్రూపు స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఈ కింద ప్రస్తావించిన 7 విశ్వవిద్యాలయాలు / కళాశాలలకు కూడా బృంద స్థాయి విజేత ట్రోఫీలను మంత్రి చేతుల మీదుగా అందజేయనున్నారు:
|
వరుస సంఖ్య
|
విశ్వవిద్యాలయం / కళాశాల పేరు
|
-
|
డీఏవీ కళాశాల, జలంధర్, పంజాబ్
|
-
|
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
|
-
|
శివాజీ విశ్వవిద్యాలయం, కొల్హాపూర్, మహారాష్ట్ర
|
-
|
పంజాబ్ కేంద్రీయ విద్యాలయం, భటిండా
|
-
|
ఎస్ఎస్‌ఎమ్ఆర్‌వీ కళాశాల, బెంగళూరు, కర్నాటక
|
-
|
చాణక్య జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం, పాట్నా, బీహార్
|
-
|
కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర, హర్యానా
|
***
(रिलीज़ आईडी: 2281627)
आगंतुक पटल : 16