ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన్‌ కీ బాత్ 135వ ఎపిసోడ్‌… ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JUN 2026 8:36PM by PIB Hyderabad

మన్‌ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగ ముఖ్య అంశాలను ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి:

భద్రత రంగంస్వయంసమృద్ధి సాధన దిశగా సానుకూల ప్రగతితో ముడిపడిన అంశాలతో నేటి ‘మన్ కీ బాత్‌’ను మొదలుపెట్టాను.

పాత ఆలోచనలను మార్చేసేఇతరుల పట్ల కరుణను చాటే అంశాల్లో మార్గదర్శకంగా నడుచుకున్నందుకు అస్సాంలోని నా సోదరీసోదరులను చూస్తే గర్వంగా ఉంది.

నాగాల్యాండ్‌లో క్రీడలను ప్రోత్సహించడంతో ముడిపడిన ఈ రెండు ప్రయత్నాలూ మీకు తప్పక నచ్చుతాయి.

ఇదుగో చూడండి.. బీహార్‌లోని నలందా విశ్వవిద్యాలయంకేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఏ విధంగా సంప్రదాయాన్నీఆధునికతనీ ఎంత సుందరంగా సమ్మిళితం చేస్తున్నారో.

భారతీయ సంస్కృతిపై మక్కువను కనబరుస్తూ డొమినికన్ రిపబ్లిక్‌లోని బ్రహ్మకమల్ డొమినికానా వైదిక మంత్రాల జప బృందం చేస్తున్న ప్రయత్నాలను నేను ప్రశంసించాను.

మేఘాలయ ప్రజలు ఏ విధంగా జీవించి ఉన్న వేర్ల వంతెనలను సంరక్షించారో గమనించివారిని చూసి భారత్‌ గర్వపడుతోంది.

ప్రజల భాగస్వామ్యమే మన అతి పెద్ద పెట్టుబడి అని భారత ప్రజలమైన మనం చాలా సార్లు నిరూపించాంపశ్చిమాసియా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసిన విజ్ఞప్తి ప్రకారం.. ప్రజలు సహృదయంతో ఆ పిలుపునకు మద్దతు తెలపడంతో పాటు పూర్తి సహకారాన్ని అందిస్తుండడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషం కలుగుతోంది.

నాందేడ్‌లో బహాదుర్‌పురాకు చెందిన పేఠ్‌కర్ కుటుంబం వివాహ సందర్భంగాగ్రామస్తులకు ప్రమాద బీమా రక్షణ కల్పించిఒక కొత్త ఉదాహరణను అందించారుఆపద సమయంలో ప్రజలకు భద్రత కవచంగా మారుతున్న ‘ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన’, ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ల సమాచారాన్ని మీరు మీ కుటుంబంతో తప్పక పంచుకోవాలని నేను కోరుతున్నాను.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా.. బ్యావ్‌రాకు చెందిన మహిళలు చెత్త నుంచి అద్భుతాన్ని చేసి చూపించారువాళ్లు అందరూ కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను పోగు చేశారుఆ వ్యర్థాలతో వాళ్లు తయారు చేసిన ఇకో-బ్రిక్స్ ఇవాళ ఊరి శోభను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

రాబోయే గణేశ్ ఉత్సవానికి గణపతి బాప్పా ప్రతిమలను తయారు చేసే వాళ్లతో పాటు వాటిని కొనుగోలు చేసే వాళ్లకు నేనొక ప్రత్యేక విన్నపాన్ని చేస్తున్నాను..’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2281449) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Marathi , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam