ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


పశ్చిమ ఆసియాలో ఇటీవలి పరిణామాలను ప్రధానికి వివరించిన అధ్యక్షుడు పెజెష్కియాన్

ఒప్పందాన్ని స్వాగతిస్తూ శాశ్వత శాంతి, సుస్థిరత కోసం నిరంతర ప్రయత్నాలు జరగాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 30 JUN 2026 9:33PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో టెలిఫోన్ లో మాట్లాడారు. 

పశ్చిమ ఆసియాలో ఇటీవలి పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు.

కుదిరిన అవగాహనను ప్రధాన మంత్రి స్వాగతించారు.  అన్ని సమస్యలనూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలనే భారత స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ప్రాంతంలో శాశ్వత శాంతి, సుస్థిరతల కోసం,  నౌకాయానం, వాణిజ్య స్వేచ్ఛ కోసం నిరంతర ప్రయత్నాలు జరగాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2281448) సందర్శకుల సూచీ సంఖ్య : : 26