ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్



సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

భారత సెమీకండక్టర్ ప్రస్థానంలో చారిత్రాత్మక ఘట్టం

సనంద్‌లోని సీజీ సెమీ ఓశాట్ కేంద్రంతో చిప్ తయారీ వ్యవస్థ బలోపేతం; సాంకేతిక స్వావలంబన, గ్లోబల్ సెమీకండక్టర్ విలువ శ్రేణిలో భారత్ స్థానం మెరుగుదలకు దోహదం: ప్రధాని

దశలవారీగా, ఇటుక ఇటుకగా, చిప్ పై చిప్‌ తయారుచేస్తూ వేగంగా పుంజుకుంటున్న సెమికాన్ ఇండియా కార్యక్రమం: ప్రధాని

భారత్ లో సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణ రాత్రికి రాత్రే జరగలేదు; గత దశాబ్ద కాలంగా దేశంలో చోటుచేసుకున్న ఎలక్ట్రానిక్స్ విప్లవంలో ఇది తదుపరి అడుగు: ప్రధాని

మొదట ఉత్పత్తులు, తర్వాత విడిభాగాలు, ఇప్పుడు సెమీకండక్టర్లు - భారత్ అంతటా మొత్తం ఎలక్ట్రానిక్స్ విలువ శ్రేణి; ఇది వికసిత భారత్‌కు అసలైన మార్గ రేఖ; ఇది మేక్ ఇన్ ఇండియా తదుపరి దశ: ప్రధాని


భారత్ లో చిప్ డిజైన్ నుంచి అమరిక, ప్యాకేజింగ్ వరకు పూర్తి సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడమే మన లక్ష్యం: ప్రధాని

భారత యువత మేడ్ ఇన్ ఇండియా చిప్‌లతో ఏఐ, రోబోటిక్స్, వచ్చే తరం టెక్నాలజీ విప్లవానికి మరింత శక్తిని అందిస్తారు: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 JUL 2026 7:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్' (ఓఎస్ఏటీకేంద్రాన్ని ప్రారంభించారుఈ సందర్భం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూదేశం తన లక్ష్యాల పట్ల కలిగి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారుదేశం తాను అనుకున్న బలమైన సంకల్పాలను ఎటువంటి సంకోచం లేకుండా నిరంతరం వాస్తవరూపంలోకి మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. "భారతదేశం ఏదైనా చేయాలని సంకల్పిస్తేదానిని కచ్చితంగా సాధిస్తుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనంఅని శ్రీ మోదీ అన్నారు

ఐదేళ్ల క్రితం ప్రారంభమైన వ్యూహాత్మక దార్శనికతను గుర్తుచేసుకుంటూదేశాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుస్వదేశీ డిజైన్స్థానిక తయారీ అనే విస్తృత వ్యూహాల ఆధారంగాదేశంలోని ఈ మూడవ అతిపెద్ద కేంద్రంలో వాణిజ్యపరమైన చిప్ ప్యాకేజింగ్ అధికారికంగా ప్రారంభం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. "మనం డిజైన్ ఇన్ ఇండియామేక్ ఇన్ ఇండియా అనే ప్రాథమిక మంత్రంతో విజయవంతంగా ముందుకు సాగాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ వేగవంతమైన అభివృద్ధి కాలక్రమాన్ని గుర్తుచేసుకుంటూ, 2024 లో తానే దీనికి శంకుస్థాపన చేశాననీఆగస్టు 2025 నాటికే చిప్ టెస్టింగ్ వేగంగా ప్రారంభం అయిందనీ ప్రధానమంత్రి ప్రస్తావించారుప్రాజెక్ట్ ప్రారంభం నుంచీ పూర్తి స్థాయి ఉత్పత్తి దశకు చేరుకోవడానికి పట్టిన ఈ అత్యంత వేగవంతమైన ప్రయాణానికి ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న అనేకమంది అసోసియేట్ల అలుపెరగని అంకితభావంఏకాగ్రతలే ప్రత్యక్ష కారణమని ఆయన కొనియాడారు. “శంకుస్థాపన నుంచి ఉత్పత్తి దశ వరకు సాగిన ఈ అద్భుతమైన ప్రయాణం కచ్చితంగా ఎంతోమంది సహోద్యోగుల అపారమైన కష్టానికి లభించిన ఫలితమేఅని శ్రీ మోదీ అన్నారు

సభను ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్ని క్షణాల ముందు తాను జరిపిన వ్యక్తిగత సంభాషణలను ప్రస్తావిస్తూఆ కేంద్రంలో పనిచేస్తున్న అంకితభావం గల సిబ్బందితో మాట్లాడిన అనుభవాలను ప్రధానమంత్రి పంచుకున్నారుప్రదర్శనను సందర్శించిన సమయంలో అనేక మంది యువ నిపుణులతో నేరుగా మాట్లాడిన ఆయనవారి ఉత్సాహంఆశావాదం,  సానుకూల దృక్పథాన్ని ప్రశంసించారు. “ఈ రోజు నేను కలిసిన ప్రతి యువ సహోద్యోగి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఒక దీపస్తంభంగా అభివర్ణిస్తూస్వదేశీజపాన్ థాయ్‌లాండ్ పరిశ్రమల భాగస్వాములను అనుసంధానించిన ఉమ్మడి ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారుఈ వెంచర్‌ను కేవలం ఒక సాధారణ వాణిజ్య సంస్థగా మాత్రమే కాకుండాసాంకేతిక విశ్వసనీయతకూసరిహద్దులు దాటిన భాగస్వామ్యానికీ ఒక బలమైన నమూనాగా ఆయన అభివర్ణించారు. "ఈ సమగ్ర భాగస్వామ్యం భారత సెమీకండక్టర్ ప్రయాణానికి పూర్తిగా సరికొత్త గమనాన్నీవేగాన్నీ ఇవ్వబోతోందిఅని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

గత రెండేళ్ళ మూడు నెలల కాలంలో సాధించిన అపారమైన పురోగతిని ప్రస్తావిస్తూఏటా 20 కోట్ల యూనిట్లను సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న వాణిజ్యపరమైన ఉత్పత్తి దశకు చేరుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారుఏటా 500 కోట్ల యూనిట్ల ఉత్పత్తిని చేరుకోవాలనే ఈ బృందం భారీ లక్ష్యంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూదేశవ్యాప్త సాంకేతిక కార్యక్రమం పుంజుకుంటున్న వేగమే ఈ శీఘ్ర పురోగతికి కారణమని ఆయన పేర్కొన్నారు. "దీనిని అడుగు మీద అడుగుగాఇటుక మీద ఇటుకగాచిప్ తరువాత చిప్‌గా నిర్మించినందుకు మొత్తం బృందాన్నిరాష్ట్ర ప్రభుత్వాన్నీదేశం మొత్తాన్ని నేను అభినందిస్తున్నానుఅని శ్రీ మోదీ అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల నిపుణులుయువతను ఉద్దేశించి ప్రసంగిస్తూప్రపంచ పారిశ్రామిక చరిత్ర నుంచి కొన్ని కీలక పాఠాలను ఉదహరించారునిజమైన తయారీ సామర్ధ్యం ఏ ఒక్క ఫ్యాక్టరీ వల్లనో రాదనీసిలికాన్ వ్యాలీసిన్చు సైన్స్ పార్క్,  సుకుబా సైన్స్ సిటీ వంటి ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక కేంద్రాలు అన్ని సదుపాయాలు ఒకేచోట ఉండే సమగ్రమైనసమీకృత వ్యవస్థలను అభివృద్ధి చేయవలసిన అత్యంత ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా వివరించారు. "ఈరోజుఅలాంటి శక్తిమంతమైన క్లస్టర్లను స్థాపించే దిశగా సనంద్ తన అడుగులను బలంగా వేస్తోందిఅని శ్రీ మోదీ అన్నారు

ఈ ప్రాంతంలో కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే మైక్రాన్కేన్స్,  సీజీ  సెమీ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తిని ఏకకాలంలో ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూదేశీయంగా ఒక బలమైన వ్యవస్థ ఎంత వేగంగా రూపుదిద్దుకుంటోందో ప్రధానమంత్రి వివరించారురాబోయే రోజుల్లో ప్రత్యేక రసాయనాల తయారీదారులుటెస్టింగ్ ల్యాబ్‌లుడిజైన్ సెంటర్లు,  సరికొత్త స్టార్టప్‌లు ఇక్కడికి వస్తాయని ఆకాంక్షిస్తూస్థానిక పరిశ్రమలు విస్తృతమైన ఆర్థికఉపాధి అవకాశాలను ఏ విధంగా రెట్టింపు చేస్తాయో వివరించారు. "ఒక పరిశ్రమ మరో పది పరిశ్రమలకు జన్మనిచ్చిచివరికి ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థనే మార్చివేసే క్లస్టర్ అసలైన శక్తి ఇదేఅని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఈ రంగానికి సంబంధించిన అపారమైన దేశవ్యాప్త,  అంతర్జాతీయ ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూఈ వేగవంతమైన వృద్ధి ఏదో అకస్మాత్తుగా జరిగిన వివిక్త పరిణామం అనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రధానమంత్రి సరిచేశారుప్రస్తుత ఈ విస్తరణ అనేది వాస్తవానికి గత పదేళ్లుగా అమలు చేస్తున్న దీర్ఘకాలిక సాంకేతిక విధానాల నుండి క్రమపద్ధతిలో రూపుదిద్దుకున్న ప్రగతి అని ఆయన వివరించారు. "గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి వచ్చిన ఎలక్ట్రానిక్స్ విప్లవానికి ఇది ఒక సహజమైన తదుపరి అడుగుఅని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ రంగంపట్ల పెరుగుతున్న విస్తృత దేశీయ అంతర్జాతీయ ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూఈ వేగవంతమైన వృద్ధి ఏ ఒక్క సంస్థ వల్ల కాదనిఇది గత పది సంవత్సరాలుగా దీర్ఘకాలిక సాంకేతిక విధానాల ఆధారంగా జాగ్రత్తగా ప్రణాళిక చేసిన పురోగమనమేనని ఆయన వివరించారు. “గత దశాబ్దంలో భారత్ లో వచ్చిన ఎలక్ట్రానిక్స్ విప్లవానికి ఇది సహజమైన తదుపరి దశ” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ స్థానిక తయారీ రంగ విజయానికి గల మూలాలను వివరిస్తూగతంలో మొబైల్ ఫోన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన పరిస్థితిని ప్రస్తుత భారీ ఉత్పత్తి వృద్ధితో ప్రధానమంత్రి పోల్చి చూపారుమొబైల్ ఉత్పత్తి రంగంలో ముప్పై మూడు రెట్ల అద్భుతమైన వృద్ధి నమోదైందని పేర్కొంటూమొబైల్ రంగంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీఎగుమతి దేశంగా భారత్ సాధించిన నూతన స్థానాన్ని ఆయన గర్వంగా గుర్తుచేశారు. " అంతిమంగా ఇలాంటి అద్భుతమైన విజయాలను సాధించే లక్ష్యంతోనేమనం మన ప్రయాణాన్ని మొబైల్ ఫోన్ల తయారీతో ప్రారంభించాంఅని శ్రీ మోదీ అన్నారు

ఇటీవలి కాలంలో దేశీయ తయారీ వ్యవస్థ సాధించిన విస్తృత విజయాన్ని గణాంకాలతో వివరిస్తూమొత్తం రంగంలో నమోదైన అద్భుతమైన వృద్ధి రేట్లను ప్రధానమంత్రి పంచుకున్నారు. 2014 నాటి స్థాయితో పోలిస్తే మొత్తం ఉత్పత్తి దాదాపు ఏడు రెట్లు పెరిగిందనిఅలాగే మొత్తం ఎగుమతులలో కూడా 11 రెట్ల భారీ వృద్ధి నమోదైందని ఆయన వెల్లడించారు. "మనం మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను విజయవంతంగా,  సమగ్రంగా బలోపేతం చేశాం”  అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ప్రభుత్వ వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను మరింత విస్తరిస్తూకేవలం వినియోగదారులకు చేరే తుది ఉత్పత్తులలో స్వయంసమృద్ధి సాధించడమే కాకుండావాటికి మూలాధారమైన విడిభాగాల తయారీని కూడా చేర్చడమే తమ తుది లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారుప్రపంచ సాంకేతికతకు శక్తినిచ్చే చిప్‌లను ఇక్కడే తయారు చేయాలనే నిశ్చయంతోప్రారంభం నుంచి ముగింపు వరకు దేశీయంగా ఒక సంపూర్ణ విలువైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. "మొదట ఉత్పత్తితర్వాత విడిభాగాలుఇప్పుడు సెమీకండక్టర్ -  ఇది మేక్ ఇన్ ఇండియా తదుపరి కచ్చితమైన దశఅని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

సెమీకండక్టర్ వ్యవస్థ భవిష్యత్తు దశలను వివరిస్తూసరఫరా శ్రేణిని పూర్తిగా సురక్షితం చేయడానికి హైటెక్ సామగ్రి, , కీలక ఖనిజాల  లభ్యతలో స్వయంసమృద్ధి సాధించవలసిన అత్యంత ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారుడిజైన్ నుంచి ప్యాకేజింగ్ వరకు విస్తరించిన ఒక స్థానిక వ్యవస్థ అవసరమని అన్నారు.  కృత్రిమ మేధరోబోటిక్స్ వంటి అధునాతన విప్లవాల కోసం ఈ స్వదేశీ చిప్‌లను ఉపయోగించుకోవడంలో మన యువతరంపై అపారమైన నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. "పూర్తిగా 'మేడ్ ఇన్ ఇండియాచిప్‌లను మాత్రమే ఉపయోగిస్తూ మన యువత తదుపరి తరం సాంకేతిక విప్లవాన్ని మరింత వేగవంతం చేయబోతోందిఅని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

పారిశ్రామిక రంగంలో ప్రధాన మార్పులు ఎల్లప్పుడూ ఎలా మునుపెన్నడూ లేని విధంగా అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయో చరిత్ర ఆధారాలను చూపుతూ ప్రధానమంత్రి వివరించారుగతంలో ఐటీస్మార్ట్‌ఫోన్ తయారీ రంగాలు తెచ్చిపెట్టిన భారీ అవకాశాలను ప్రస్తుత సాంకేతిక మార్పులతో పోలుస్తూరాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "సెమీకండక్టర్ఏఐ విప్లవాల యుగం రీసెర్చ్డిజైన్ నుంచి  సరఫరా శ్రేణి నిర్వహణ వరకు లెక్కలేనన్ని అవకాశాలను తీసుకువస్తోందిఅని శ్రీ మోదీ అన్నారు

భవిష్యత్ శ్రామిక శక్తి నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలచు కోవడాన్ని సవాలుగా తీసుకోవాలనినిరంతరం సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం,  వినూత్న ఆలోచనలను పదును పెట్టుకోవడంపైనే ఆధునిక సమాజంలో వారి ప్రాధాన్యత పూర్తిగా ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుకృత్రిమ మేధ ద్వారా తెరుచుకుంటున్న అపారమైన సరికొత్త అవకాశాలను  ప్రస్తావిస్తూమున్ముందు రాబోయే ఈ అవకాశాలను అమితమైన ఉత్సాహంతో అందుకోవాలని ఆయన యువతరానికి పిలుపునిచ్చారు. "కొత్త విషయాలను నేర్చుకోవడానికీవాటిని ఆచరణలో పెట్టడానికీ లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని భారత యువత ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదుఅని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఈ సాంకేతిక పురోగతి వల్ల సమాజంలో కలిగే సమ్మిళిత సామాజిక ప్రభావాన్ని వివరిస్తూఈ కొత్త కేంద్రంలో చురుగ్గా పనిచేస్తున్న గిరిజన తెగలకు చెందిన యువతుల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకున్నారుసామాన్య నేపథ్యాల నుంచి వచ్చిఐటీఐ చదువులు పూర్తి చేసిమలేషియాలో అధునాతన సాంకేతిక శిక్షణ పొందే వరకు వారు సాగించిన ప్రయాణం ఆయనను ఎంతగానో కదిలించిందిగతంలో తమ సొంత ప్రాంతాలను దాటి ఎప్పుడూ ప్రయాణించనప్పటికీప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఉత్పాదక ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన కొనియాడారు. " అసాధారణమైన కలలు కంటున్న ఈ కుమార్తెలు ఈ రోజు 'మేడ్ ఇన్ ఇండియాచిప్ తయారీ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగంగా మారారుఅని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారత్ ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా  మారే దిశగా సాగిస్తున్న వేగవంతమైన ప్రయాణాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారుకేవలం కొన్ని నెలల క్రితం తాము వాగ్దానం చేసిన బహుళ ఉత్పాదక కేంద్రాలను గడువు లోపలే పూర్తి చేయడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుఅంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్పష్టమైన విధానపరమైన స్థిరత్వంకచ్చితమైన నిర్ణయాధికారంసాటిలేని పని వేగంపై సంపూర్ణ భరోసా ఇస్తూవ్యవస్థాగత ఆర్థిక సంస్కరణలను మున్ముందు మరింత వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. "వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం పట్ల పూర్తి నిబద్ధతతో 140 కోట్ల మంది భారతీయులు 2047 నాటికి భారత్ ను కచ్చితంగా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దుతారుఅని శ్రీ మోదీ అన్నారు.  

 

***


(रिलीज़ आईडी: 2281260) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam