జల శక్తి మంత్రిత్వ శాఖ
7వ జాతీయ జల అవార్డులను ప్రారంభించిన కేంద్ర జల శక్తి మంత్విత్వ శాఖ
దరఖాస్తుల సమర్పణకు చివరి తేది 28 ఆగస్టు 2026
प्रविष्टि तिथि:
03 JUL 2026 4:43PM by PIB Hyderabad
జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన 'జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం 7వ జాతీయ జల అవార్డులను ప్రకటించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఈ అవార్డుల ప్రక్రియను ప్రారంభించారు. అర్హత కలిగిన సంస్థలు, దరఖాస్తుదారులు కేవలం ఆన్‌లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో (www.awards.gov.in) మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.మరిన్ని వివరాల కోసం హోం మంత్రిత్వశాఖ వేదికను లేదా సంబంధిత విభాగం వెబ్‌సైట్‌ను (www.jalshakti-dowr.gov.in) సందర్శించవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 28 ఆగస్టు, 2026.
అర్హతలు...
నీటి సంరక్షణ, నీటి నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన ఏ రాష్ట్రమైనా, జిల్లా అయినా, పట్టణ స్థానిక సంస్థలు, డ్యామ్ నిర్వహణ సంస్థలు, పరిశ్రమలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ట్రోఫీ, ప్రశంసాపత్రం...
ఈ జాతీయ జల అవార్డులకు ఎంపికైన ప్రతి విజేతకు ఒక ప్రతిష్టాత్మకమైన ట్రోఫీతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు.
ఎంపిక ప్రక్రియ
7వ జాతీయ జల అవార్డుల కోసం వచ్చిన అన్ని దరఖాస్తులను మొదట ఒక స్క్రీనింగ్ కమిటీ నిశితంగా పరిశీలించి అర్హత కలిగిన వాటిని ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత ఎంపిక చేసిన దరఖాస్తులను జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి జ్యూరీ కమిటీ ముందు ఉంచుతారు. ఈ జ్యూరీ కమిటీ చేసే సిఫార్సులను తుది ఆమోదం కోసం కేంద్ర జలశక్తి మంత్రికి సమర్పిస్తారు. మంత్రి ఆమోదం అనంతరం ఒక మంచి రోజున విజేతల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత నిర్వహించే ప్రత్యేక అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో భారత రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు.
అవార్డుల వివరాలు..
దేశాన్ని జల సమృద్ధ భారత్‌గా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా.. రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు దేశవ్యాప్తంగా చేసిన అసాధారణ కృషిని, ప్రయత్నాలను గుర్తించి, ప్రోత్సహించడానికి ఈ జాతీయ జల అవార్డులను ప్రారంభించారు. నీటి ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, అత్యుత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యం. జలచక్రంలో ఉపరితల జలాలు, భూగర్భ జలాలుగ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నందున దేశంలో నీటి వనరుల నిర్వహణ పట్ల అన్ని వర్గాల వారు ఒక సమగ్రమైన విధానాన్ని అవలంబించేలా ప్రోత్సహించడం కూడా ఈ అవార్డుల లక్ష్యం. ఈ జాతీయ జల అవార్డుల మొదటి విడతను జలవనరుల విభాగం 2018 సంవత్సరంలో ప్రారంభించగా.. ఇప్పటివరకు 6 ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించారు.
***
(रिलीज़ आईडी: 2280951)
आगंतुक पटल : 13