రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యవసర వైద్య సేవలు మరింత బలోపేతం: రోడ్డు అంబులెన్సుల కోసం మెరుగైన భద్రతా నిబంధనలు


AIS-125 ముసాయిదా సవరణలు... ప్రత్యేక అంబులెన్సులు, తప్పనిసరి రెస్క్యూ పరికరాలు, ఈ-అంబులెన్సులకు కొత్త నిబంధనలు

प्रविष्टि तिथि: 02 JUL 2026 4:28PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా రోడ్డు అంబులెన్సుల భద్రతపనితీరు వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ ‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్’ (ఏఐఎస్)-125 నిబంధనలకు సవరణలను ప్రతిపాదించింది. అత్యవసర వైద్య సేవల్లో రోడ్డు అంబులెన్సులు అత్యంత కీలకమైనవి. ఇవి రోగులను ఆసుపత్రులకు తరలించడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అధునాతన అత్యవసర వైద్య సహాయాన్ని అందిస్తాయి. దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే సరైన సమయంలో వైద్య సహాయం అందిస్తే వీటిలో చాలా మరణాలను నివారించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే.. దాదాపు 50 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ద్విచక్ర వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులందరికీ అవసరమైన ఉచిత వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి-రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రిహామీతో కూడిన చికిత్స (పీఎం-ఆర్ఏహెచ్ఏటీ) పథకాన్ని నోటిఫై చేసింది. అయితే ఈ చికిత్స అందడంతో పాటుప్రజలకు అంబులెన్సులు తక్షణమే అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యం. వైద్య సిబ్బందికి విధులు నిర్వహించడానికి వీలుగా ఈ అంబులెన్సుల రూపొందించడంఅలాగే ప్రయాణ సమయంలో రోగులకు గరిష్ట రక్షణసౌకర్యంభద్రత కల్పించడం కూడా అంతే ముఖ్యం.

రోడ్డు అంబులెన్సుల నిర్మాణంవాటి కార్యాచరణకు సంబంధించిన అవసరాలను నిర్దేశిస్తూ కేంద్ర రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ 2016 సెప్టెంబర్ 8 నాటి నోటిఫికేషన్ (జి.ఎస్.ఆర్. 868(ఈ)) ద్వారా ఏఐఎస్-125 (1వ భాగం) ప్రమాణాలను తీసుకొచ్చింది.  దీంతోపాటు వివిధ రకాల అంబులెన్సులలో ఉండాల్సిన అవసరమైన వైద్య పరికరాల వివరాలను తెలియజేస్తూ ఏఐఎస్-125 (2వ భాగం) నిబంధనలను ఒక మార్గదర్శక ప్రమాణంగా విడుదల చేసింది. ప్రస్తుతం మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ నిబంధనలకే మరిన్ని సవరణలను కేంద్రం ప్రతిపాదించింది.

రోడ్డు అంబులెన్సుల భద్రతనువాటి పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా ఏఐఎస్-125 (1వ భాగం)ఏఐఎస్-125 (2వ భాగం) నిబంధనలకు సంబంధించిన సవరణలను ఇప్పుడు ఆమోదించారు. ఈ సవరణల ద్వారా  ప్రత్యేక రోడ్డు అంబులెన్సులను అందుబాటులోకి తెస్తున్నారు. అవి..

(i) నియోనాటల్ రోడ్డు అంబులెన్సు: అనారోగ్యంతో ఉన్న లేదా నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువులను మెరుగైన అత్యవసర వైద్య చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి సురక్షితంగా తరలించడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

 

(ii) మల్టీ-స్ట్రెచర్ రోడ్డు అంబులెన్సు: ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్ట్రెచర్లను తీసుకెళ్లేలా దీనిని రూపొందించారు. అయితే ఇందులో ఒకే సమయంలో ఒక రోగికి అత్యంత అధునాతన ఇంటెన్సివ్ కేర్  వైద్య సహాయాన్ని అందించడంపై ప్రధానంగా దృష్టి పెడతారు.

రెస్క్యూ పరికరాలు తప్పనిసరి

క్లాస్ బీసీడీ కేటగిరీల కిందకు వచ్చే అన్ని రకాల రోడ్డు అంబులెన్సుల్లో అత్యవసర రెస్క్యూ పరికరాలను ఉంచడం ఇకపై తప్పనిసరి. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న వాహనాల్లో చిక్కుకుపోయిన బాధితులను సురక్షితంగా బయటకు తీసేందుకుఅలాగే ఒకవేళ అంబులెన్స్ స్వయంగా ప్రమాదానికి గురైనా సరే... తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి.

ఈ-అంబులెన్సుల కోసం ప్రత్యేక విద్యుత్ వనరు: పర్యావరణ హితమైన రవాణా (గ్రీన్ మొబిలిటీ) దిశగా అడుగులు వేస్తూనే.. రోగులకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఎలక్ట్రిక్ అంబులెన్సుల కోసం ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చారు. వీటిలో వైద్య పరికరాలను నిరంతరాయంగా నడపడం కోసం ఒక ప్రత్యేక విద్యుత్ వనరులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంబులెన్సులలో అమర్చే అన్ని రకాల వైద్య పరికరాలు ఏయే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలో కూడా ఏఐఎస్-125 (2వ విభాగం) లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ సవరణలకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ జీఎస్ఆర్ 382(ఈ)ను 2026 మే 14న విడుదల చేశారు. దీనిని తుది రూపంలో ఖరారు చేసేందుకు వీలుగాప్రజల నుంచి సలహాలుఅభిప్రాయాలను ఆహ్వానిస్తూ ప్రస్తుతం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ నిసంధనలన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోయే అధికారిక తుది నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2280565) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam