ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
తల్లిదండ్రులు, విద్యార్థులకు పెద్ద ఉపశమనం: డిజిటల్ వేదికల ద్వారా విద్యా రికార్డులను సులభంగా పొందే వీలు కల్పిస్తూ, పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థల మధ్య బదిలీ ప్రక్రియ సులభతరం
పోటీ పరీక్షల దరఖాస్తుల డిజిటల్ పరిశీలన వల్ల మానవ జోక్యం లేకుండా ప్రక్రియ మరింత పారదర్శకం
11 ఏళ్ల డిజిటల్ ఇండియా: డిజిటల్ రూపంలో 110 కోట్లకు పైగా విద్యా రికార్డులతో సురక్షితమైన, సులభమైన, ధృవీకరించదగిన విద్యా సేవలు
प्रविष्टि तिथि:
02 JUL 2026 6:05PM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా కార్యక్రమం 1 జూలై 2026 నాటికి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకోగా, పాలనను మరింత పారదర్శకంగా, అందుబాటులో ఉండేలా, ప్రజా ప్రాధాన్య కేంద్రితంగా మార్చేందుకు భారత్ తన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను నిరంతరం బలోపేతం చేస్తోంది. 2015లో ప్రారంభమైనప్పటి నుంచి డిజిటల్ ఇండియా విద్యా రంగంతో సహా వివిధ రంగాలలో ప్రభుత్వ సేవలను అందించే ప్రక్రియను పూర్తిగా మార్చివేసింది. నమ్మకమైన డిజిటల్ వేదికల ద్వారా ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేస్తూ సమర్థవంతమైన పాలనను పెంపొందిస్తోంది.
విద్యా రంగంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా నిరంతర అభ్యాసం, విద్యాపరమైన చలనశీలత, సురక్షితమైన డిజిటల్ ధృవపత్రాలను ప్రోత్సహించే డిజిటల్ వేదికల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందించింది. ఈ విప్లవాత్మక మార్పుకు చోదక శక్తులుగా నిలిచిన కీలకమైన కార్యక్రమాలలో 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ), నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఎడి) ప్రధానమైనవి.
[ Tweet: https://x.com/DigitalIndiaCrp/status/2057418668406174097?s=20 ]
అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్: సౌకర్యవంతమైన అభ్యాసానికి వెసులుబాటు
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) నియంత్రణ, విద్యా మంత్రిత్వ శాఖ చొరవతో రూపొందించిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ) గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల నుంచి విద్యార్థులు పొందిన విద్యా క్రెడిట్లను నిల్వ చేయడానికీ, బదిలీ చేయడానికీ, రీడీమ్ చేయడానికీ ఉపయోగపడే ఒక డిజిటల్ వేదిక. ఇది మల్టిపుల్ ఎంట్రీ - మల్టిపుల్ ఎగ్జిట్ (ఎమ్ ఈఎమ్ఈ), క్రెడిట్ బదిలీ, సౌకర్యవంతమైన అభ్యాస మార్గాలను అనుమతించడం ద్వారా జాతీయ విద్యా విధానం 2020కీ. నేషనల్ క్రెడిట్ విధానానికీ మద్దతు ఇస్తుంది.
ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్) తో అనుసంధానించిన ఏబీసీ ప్రతి అభ్యాసకుడికీ ఒక ప్రత్యేకమైన జీవితకాల విద్యా గుర్తింపును అందిస్తుంది, ఇది ఒకే డిజిటల్ వేదిక ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర గుర్తింపు పొందిన అభ్యాస కార్యక్రమాలలో విద్యా రికార్డులను సురక్షితంగా పొందే వీలు కల్పిస్తుంది.
తాజా పురోగతి ప్రకారం, 2,963 ఉన్నత విద్యా సంస్థలు ఏబీసీ వేదికలో నమోదు చేసుకున్నాయి. 26.29 కోట్లకు పైగా అపార్ (ఏపీఏఏఆర్) ఐడీలను నమోదు చేశారు. 110.65 కోట్లకు పైగా విద్యా రికార్డులను అప్‌లోడ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ విద్యా వ్యవస్థ పెరుగుతున్న వినియోగాన్ని ప్రతిబింబిస్తోంది.
ఏబీసీ భౌతిక పత్రాల స్థానంలో సురక్షితమైన డిజిటల్ రికార్డులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా పరిపాలనను సరళీకృతం చేస్తోంది. దీనివల్ల విద్యార్థులు తమ విద్యా క్రెడిట్లను ఆన్‌లైన్‌లో పొందడానికి, బదిలీ చేయడానికి, రీడీమ్ చేయడానికి వీలవుతుంది. ఇది ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, ఉపాధి కోసం విద్యార్హతల వేగవంతమైన ధృవీకరణను కూడా సులభతరం చేస్తుంది. కాగితపు పనిని తగ్గించడంతో పాటు పారదర్శకతను, నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
[ Tweet: https://x.com/DigitalIndiaCrp/status/2054431379547365770?s=20 ]
నేషనల్ అకడమిక్ డిపాజిటరీ: విశ్వసనీయమైన డిజిటల్ విద్యా రికార్డులు
నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) విద్యా పురస్కారాల 24×7 ఆన్‌లైన్ వేదిక. ఇది విద్యా సంస్థలు విద్యా ధృవీకరణ పత్రాలు, డిగ్రీలు, డిప్లొమాలు, మార్కుల జాబితాలను సురక్షితమైన డిజిటల్ రూపంలో జారీ చేయడానికి, భద్రపరచడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ఎన్ఏడి అభ్యాసకులకు ఎప్పుడైనా, ఎక్కడైనా ధృవీకరించిన విద్యా రికార్డులను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యా సంస్థలు, యజమానులు, ప్రభుత్వ సంస్థలు విద్యార్హతలను డిజిటల్ రూపంలో ధృవీకరించుకోవడానికి అనుమతిస్తుంది.
భౌతిక ధృవీకరణ పత్రాల స్థానంలో డిజిటల్ రూపంలో ధృవీకరించిన రికార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఎన్ఏడీ పరిపాలన ఖర్చులను తగ్గిస్తుంది, కాగితపు పనిని తగ్గిస్తుంది. విద్యా పత్రాలు పోగొట్టుకునే లేదా దెబ్బతినే ప్రమాదాన్ని నివారిస్తుంది. సురక్షితమైన ఆన్‌లైన్ ధృవీకరణ వల్ల నకిలీ ధృవీకరణ పత్రాల వినియోగాన్ని అరికట్టడంలో సహాయపడటంతో పాటు ప్రవేశాలు, నియామకాలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రజా సేవల్లో పారదర్శకతను, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఏబీసీ, ఏపీఏఏఆర్, ఎన్ఏడీ ముఖ్య ప్రయోజనాలు
అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ), ఏపీఏఏఆర్, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) కలిసి భారత డిజిటల్ విద్యా వ్యవస్థను ఈ క్రింది విధాలుగా బలోపేతం చేస్తున్నాయి:
-
సురక్షితమైన డిజిటల్ విద్యా రికార్డులను అందించడం, భౌతిక ధృవీకరణ పత్రాలపై ఆధారపడటాన్ని తగ్గించడం పత్రాలు పోగొట్టుకోవడం/దెబ్బతినడం/ నకిలీల తయారీ ప్రమాదాన్ని నివారించడం.
-
సమన్వయం చేసిన డిజిటల్ వేదికల ద్వారా విద్యా క్రెడిట్లు, ధృవీకరణ పత్రాలు మార్కుల జాబితాలను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందే వీలు కల్పించడం.
-
ఎన్ ఈ పి 2020కి అనుగుణంగా విద్యా క్రెడిట్ బదిలీ, మల్టిపుల్ ఎంట్రీ-మల్టిపుల్ ఎగ్జిట్ (ఎమ్ఈఎమ్ఈ)ని సులభతరం చేయడం ద్వారా సౌకర్యవంతమైన అభ్యాసానికి మద్దతు ఇవ్వడం.
-
విద్యా సంస్థలు, యజమానులు, ప్రభుత్వ సంస్థల ద్వారా విద్యార్హతల వేగవంతమైన డిజిటల్ ధృవీకరణతో ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఉపాధి ప్రక్రియలను వేగవంతం చేయడం.
-
మాన్యువల్ ధృవీకరణ, పదేపదే సమర్పించే పత్రాల స్థానంలో ధృవీకరించిన డిజిటల్ రికార్డులను ప్రవేశపెట్టడం ద్వారా కాగితాల పనిని, పరిపాలనా భారాన్ని తగ్గించడం.
-
డిజిలాకర్, ఇతర డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విద్యా రికార్డుల సురక్షిత మార్పిడి, పరస్పర కార్యకలాపాలకు వీలు కల్పించడం.
లబ్ధిదారుల కథనాలు
ఎ పి ఏఏఆర్ ఐడీ ధృవీకరణ ప్రక్రియను సరళీకృతం చేసిందని, కాగితపు పనిని గణనీయంగా తగ్గించిందని ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ రుంగ్టా ఇంటర్నేషనల్ స్కిల్స్ యూనివర్సిటీ ఎమ్బీఏ విద్యార్థిని అంజలి రాథోడ్ అన్నారు. సదస్సులు, పోటీలు, ఇంటర్న్‌షిప్‌లు, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం వల్ల తనకు అవసరమైనప్పుడల్లా తన విద్యా ఆధారాలను సులభంగా పొందగలుగుతున్నానని ఆమె చెప్పారు. ఈ డిజిటల్ వ్యవస్థ సమయాన్ని, శ్రమను ఆదా చేసింది. ఇది ఆధునికమైనదిగా, నమ్మదగినదిగా, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని నిరూపితమైందని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో గల గవర్నమెంట్ వీవైటి పీజీ పఅటానమస్ కాలేజ్ విద్యార్థి ఆశిష్ తివాంగన్ మాట్లాడుతూ, ఏపీఏఏఆర్ ఐడీ తన విద్యా విషయాల నిర్వహణను చాలా సులభతరం చేసిందని అన్నారు. తన మార్కుల జాబితాలు, ధృవీకరణ పత్రాలు, విద్యా రికార్డులు ఇప్పుడు డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉన్నాయని, అవసరమైనప్పుడల్లా వాటిని సులభంగా పొందవచ్చని ఆయన చెప్పారు. భవిష్యత్తు ప్రవేశాల కోసం ఏపీఏఏఆర్ ఐడీ విద్యా క్రెడిట్ బదిలీకి మద్దతు ఇస్తుందని, స్కాలర్‌షిప్ ధృవీకరణను సరళీకృతం చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ చొరవ విద్యార్థుల పర్యావరణ వ్యవస్థను మరింత సున్నితంగా, సులభతరంగా కాగిత రహితంగా మార్చిందని, ఇది విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు.
డిజిటల్ ఇండియా ఆధ్వర్యంలో విశ్వసనీయమైన డిజిటల్ విద్యా వ్యవస్థ నిర్మాణం
ఏబీసీ, ఎన్ఏడీ, ఏపీఏఏఆర్, డిజిలాకర్‌ల అనుసంధానం విద్యా రికార్డుల సురక్షిత నిల్వ, నిరంతర మార్పిడి, డిజిటల్ ధృవీకరణకు వీలు కల్పించే ఒక ఉమ్మడి డిజిటల్ విద్యా వ్యవస్థను సృష్టించింది. ఈ చొరవలన్నీ కలిసి విద్యా సంస్థల మధ్య పరస్పర కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయి. విద్యాపరమైన రాకపోకలకు మద్దతు ఇస్తాయి. ఎన్ఈపి 2020 లక్ష్యాలకు అనుగుణంగా నిరంతర అభ్యాస ప్రక్రియను సులభతరం చేస్తాయి.
గడచిన పదకొండేళ్లలో, డిజిటల్ ఇండియా విద్యా రికార్డులను సురక్షితంగా, సులభంగా బదిలీ చేసుకునేలా, డిజిటల్ రూపంలో ధృవీకరించుకునేలా చేయడం ద్వారా విద్యా సేవల లభ్యతను పూర్తిగా మార్చివేసింది. ఏబీసీ, ఎన్ఏడి వంటి కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వం కాగిత రహిత పరిపాలనను ముందుకు తీసుకెళ్తోంది. పరిపాలనా భారాన్ని తగ్గిస్తోంది. వికసిత భారత్ సంకల్పానికి మద్దతుగా నిలిచే నమ్మకమైన, ప్రజా ప్రాధాన్య కేంద్రీకృత డిజిటల్ విద్యా వ్యవస్థను నిర్మిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2280561)
आगंतुक पटल : 9