ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
11 ఏళ్ల డిజిటల్ ఇండియా: మెరుగైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ మార్కెట్లతో ప్రజలకు జీవన సౌలభ్యం
ప్రపంచంలో జరిగే ప్రతి రెండవ వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో ఒకటి భారత యూపీఐ ద్వారానే ప్రాసెస్
10వ దేశంగా గ్రీస్ కూడా యూపీఐని ఆమోదించడంతో అంతర్జాతీయంగా భారత యూపీఐకి మరింత గుర్తింపు
తల్లీ,పిల్లలకు మెరుగైన పోషకాహారం: పోషణ్ ట్రాకర్ వేదిక ద్వారా నిరంతర పర్యవేక్షణతో 13 లక్షలమందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారుల అనుసంధానం
కొనుగోలుదారుల స్వర్గధామం: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇండియా హ్యాండ్‌మేడ్ డిజిటల్ మార్కెట్ ద్వారా పెరుగుతున్న చేనేత కార్మికులు, కళాకారుల ఆదాయం
प्रविष्टि तिथि:
01 JUL 2026 7:45PM by PIB Hyderabad
భారతదేశంలో దాదాపు ప్రతి లావాదేవీ నగదు రూపంలోనే జరిగే కాలం ఉండేది. ఇది దైనందిన జీవితంలో అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. చేతిలో కరెన్సీని మోసుకెళ్లడం ఒక భారంగా మారడమే కాకుండా, చిల్లర కోసం తరచూ వెతుక్కోవాల్సి వచ్చేది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా, ఆరోగ్య సూచికలను పర్యవేక్షించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలో రికార్డులను నిర్వహించడం, సేవల అందజేతను సమన్వయం చేయడం వంటివన్నీ నెమ్మదిగా, కాగితాలపై ఆధారపడుతూ, దశలు దశలుగా సాగేవి. 2015 జూలై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమవడంతో ఈ పరిస్థితి మారడం మొదలైంది. గడిచిన సంవత్సరాలలో, ఈ మార్పు ఎంతో సుదూర ప్రభావం చూపింది. దీని ఫలితం ఇప్పుడు దైనందిన జీవితంలోని అత్యంత చిన్న కోణాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
నేడు డిజిటల్ ఇండియా ఒక బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రూపంలోకి మారింది. ఇది భారత చెల్లింపుల విధానాన్ని, ప్రభుత్వ సేవల అందుబాటును, జీవనోపాధికి లభిస్తున్న మద్దతును పూర్తిగా మార్చివేస్తోంది. తక్షణ డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్న ఢిల్లీలోని ఒక టీ వ్యాపారి మొదలుకొని చేతితో తయారుచేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న జార్ఖండ్‌లోని చేనేత కార్మికుడి వరకు, ఒక చిన్నారి ఆరోగ్య రికార్డులను నిరంతరం నవీకరించే ఒడిశాలోని అంగన్‌వాడీ కార్యకర్త వరకు డిజిటల్ సాంకేతికతలు దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. కోట్ల మంది పౌరులు, వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అత్యంత ఇష్టమైన విధానంగా మారగా, డిజిటల్ వేదికలు దేశవ్యాప్తంగా పరిపాలనను, ఆరోగ్య సంరక్షణను, వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు సంబంధించి నాలుగు ఉదాహరణలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
మెరుగైన ఆరోగ్యం, అందుబాటు ధరల్లో చేనేత వస్త్రాలు
ఈ విప్లవాత్మక మార్పు ప్రజల ఆరోగ్యాన్ని , జీవనోపాధిని ఒకేసారి ఎలా స్పృశిస్తోందనే దాంట్లోనే అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. ఒకవైపు, 'పోషణ్ ట్రాకర్' దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలలో పోషకాహార సేవల పంపిణీకి నిరంతర పారదర్శకతను చేకూరుస్తూ, ఏ ఒక్క లబ్ధిదారుడైన పిల్లాడు లేదా తల్లి నిర్లక్ష్యానికి గురికాకుండా చూసేందుకు సహాయపడుతోంది. మరోవైపు, 'ఇండియా హ్యాండ్‌మేడ్' వంటి డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లు గ్రామీణ కళాకారులను నేరుగా జాతీయ స్థాయి కొనుగోలుదారులతో అనుసంధానిస్తూ మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తున్నాయి. దీనివల్ల హస్తకళాకారులు తమ శ్రమకు తగ్గ ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ, సులభంగా, అందుబాటు ధరల్లో లభించే చేనేత వస్త్రాలు - ఇవన్నీ కలిసి అటు పట్టణ, ఇటు గ్రామీణ భారత ప్రజలందరి దైనందిన జీవితాన్ని నిశ్శబ్దంగా మరింత సులభతరం, గౌరవప్రదం, సురక్షితం చేస్తున్నాయి.
ప్రపంచంలో ప్రతి రెండవ వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే
***
(रिलीज़ आईडी: 2280294)
आगंतुक पटल : 5