ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బంగారం స్మగ్లింగ్ ముఠాను గుట్టురట్టు చేసిన డీఆర్‌ఐ.


రూ.34 కోట్ల విలువైన 24 కిలోల విదేశీ బంగారం స్వాధీనం, ఏడుగురు అరెస్ట్

प्रविष्टि तिथि: 01 JUL 2026 5:37PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌లోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరుగుతున్న విదేశీ బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో అత్యంత పక్కాగా సాగుతున్న ఓ భారీ బంగారం స్మగ్లింగ్ ముఠా నెట్‌వర్క్‌ను డీఆర్ఐ అధికారులు విజయవంతంగా చేధించి, దానిని భగ్నం చేశారు.

 

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు, పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించారు. కృష్ణానగర్ నుంచి చక్‌దహా వైపు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులను అధికారులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అధికారుల తనిఖీల్లో దొరకకుండా తప్పించుకునేందుకు ఆ ఏడుగురు తమ నడుము చుట్టూ ప్రత్యేకంగా కుట్టించుకున్న బట్టల బెల్టులను ధరించారు. అధికారులు వారిని క్షుణ్ణంగా సోదా చేయగా, ఆ నడుము బెల్టుల లోపల అత్యంత చాకచక్యంగా దాచిన 180 విదేశీ మార్కు ఉన్న, రూపుమార్చిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 

 

స్వాధీనం చేసుకున్న ఈ విదేశీ బంగారం మొత్తం బరువు సుమారు 24 కిలోలు ఉండగా, దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 34 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భారీ బంగారాన్ని కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాలో కీలక పాత్ర పోషించిన  ఏడుగురు నిందితులను అక్కడే అరెస్ట్ చేశారు.

 

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు సమీప ప్రాంతాల నుంచి ఈ బంగారాన్ని సేకరించినట్లు, దీనిని మరో ప్రాంతంలో ఉండే వేరే ముఠా సభ్యులకు అప్పగించేందుకు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

***


(रिलीज़ आईडी: 2280111) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Tamil