ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ సారథి-పీఎంజేఏవై వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డా
వాట్సాప్ ద్వారా ప్రతి పౌరుడికీ ఆయుష్మాన్ భారత్ సేవల సౌలభ్యం
లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలు లేదా కాల్ సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా ఎప్పుడైనా.. ఎక్కడైనా సేవలు పొందే వీలు
प्रविष्टि तिथि:
29 JUN 2026 4:52PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు న్యూఢిల్లీలో ఆయుష్మాన్ సారథి-పీఎంజేఏవై వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. ఈ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) రూపొందించిన “ఆయుష్మాన్ సారథి” చాట్‌బాట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) సేవలను 24 గంటలూ సులభంగా, సురక్షితంగా పొందే వీలు కల్పిస్తుంది.
ఈ పథకం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు లేదా కాల్ సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా అవసరమైన సేవలు పొందడానికి ఈ చాట్‌బాట్ వీలు కల్పిస్తుంది. పీఎంజేఏవై వ్యవస్థలతో సురక్షిత ఏపీఐ ఆధారిత అనుసంధానంతో రూపొందించిన ‘ఆయుష్మాన్ సారథి’ వాట్సాప్‌లో ప్రత్యక్ష సమాచారంతోపాటు సేవలను కూడా నేరుగా అందిస్తుంది.
దీనికింద లభించే కీలక సేవలు
ఆయుష్మాన్ సారథి ద్వారా లబ్ధిదారులకు కింది విస్తృత కేంద్రీకృత సేవలు లభిస్తాయి:
· పీఎంజేఏవై కింద అర్హత తనిఖీ
· మై ఆయుష్మాన్ కార్డ్
o ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు
o ఆయుష్మాన్ కార్డు డౌన్‌లోడ్
o ఇకేవైసీ తిరిగి నమోదు
o ఆధార్ అనుసంధానం
o పీఎంజేఏవై కార్డు లాక్/అన్‌లాక్
· ఆయుష్మాన్ వయో వందన కార్డు (70 ఏళ్లు పైబడిన వారికి)
· వాలెట్ నిల్వ వీక్షణ
· చికిత్స చరిత్ర వీక్షణ
· పథకం కింద జాబితాలోని సమీప ఆస్పత్రుల అన్వేషణ
· ఫిర్యాదుల నమోదు.. పురోగతి పరిశీలన.. ఉపసంహరణ
· కాల్ బ్యాక్ అభ్యర్థన
· ఆస్పత్రి నుంచి విడుదల (డిశ్చార్జ్)పై అభిప్రాయ సేకరణ
లబ్ధిదారుల అనుభవం మెరుగుదల
కింది చర్యల ద్వారా సౌలభ్యం... పారదర్శకత... పౌర భాగస్వామ్యం మెరుగుదలకు ప్రాధాన్యమిస్తూ ఆయుష్మాన్ సారథి రూపొందింది:
· వాట్సాప్ ద్వారా పీఎంజేఏవై సేవల తక్షణ సౌలభ్యం.
· ప్రత్యేక్ష ఏపీఐ ఆధారిత సేవా ప్రదానానికి శ్రీకారం.
· భౌతిక సందర్శన, కాల్ సెంటర్లపై పరాధీనతను తగ్గించడం.
· సకాలంలో ఫిర్యాదుల నమోదు.. లబ్ధిదారులకు సహాయం
· సేవా నాణ్యత పర్యవేక్షణ బలోపేతం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి తర్వాత డిజిటల్ అభిప్రాయ సేకరణ సౌలభ్యం
మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం డిజిటల్ పాలన
పీఎంజేఏవై లబ్ధిదారులకు, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థకు మధ్య ఈ చాట్‌బాట్ ఓ కీలక డిజిటల్ సంధానంగా పనిచేస్తుంది. తద్వారా సమర్థ సేవా ప్రదానంతో లబ్ధిదారులలో సంతృప్తి మెరుగుదలకు తోడ్పడుతుంది. అభిప్రాయ సేకరణ, ఫిర్యాదుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానంలో నిరంతర మెరుగుదలకు తోడ్పడుతూ డేటా ఆధారిత పాలనకూ మద్దతిస్తుంది.
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సంరక్షణ సేవల సౌలభ్యం పెంపుతోపాటు వాటిని పారదర్శకంగా, పౌర-కేంద్రకంగా మార్చడంలో కీలక మలుపును ఆయుష్మాన్ సారథి ప్రతిబింబిస్తుంది.
ఆయుష్మాన్ సారథి వినియోగం ఎలా?
ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు కింది ‘క్యూఆర్’ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా +91 72908 23838 నంబరుకు వాట్సాప్‌లో “Hi” అని పంపడం ద్వారా అధికారిక పీఎంజేఏవై ఆయుష్మాన్ సారథి - వాట్సాప్ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చు. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటూ సురక్షిత, ఏపీఐ ఆధారిత సేవల సౌలభ్యం కల్పిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2279181)
आगंतुक पटल : 6