ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సీషెల్స్ 50వ స్వాతంత్ర్య ఉత్సవాలకు హాజరయిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 29 JUN 2026 8:00AM by PIB Hyderabad

సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ 50వ స్వాతంత్ర ఉత్సవాలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారుఆ దేశ స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొన్న తొలి భారత ప్రధాని ఆయనే.
భారత్సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలోనే ఈ స్వాతంత్ర్య ఉత్సవాలు కూడా జరగడం విశేషంఈ ప్రత్యేక సందర్భంలో
.. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల జాతీయ కవాతులో భారత రక్షణ బలగాలు పాల్గొన్నాయిరెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ.. ఈ భారత బృందంలో అస్సాం రైఫిల్స్భారత నౌకాదళంభారత నౌకాదళ మార్చింగ్ బ్యాండ్ సిబ్బంది ఉన్నారుఈ వేడుకల్లో భాగంగాసంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత నౌకాదళానికి చెందిన తర్కాష్ఇక్షాక్ నౌకలు విక్టోరియా నౌకాశ్రయానికి చేరుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనడం.. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాన్నీసుదీర్ఘ స్నేహబంధాన్నీ సూచిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2278790) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam