గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో గ్రామీణాభివృద్ధిపై జూన్ 28–29 తేదీల్లో తొలి జాతీయ సదస్సు

‘వికసిత్ గ్రామ్, వికసిత్ భారత్’ జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రాధాన్యతా పథకాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణే లక్ష్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు

గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోసం ఉమ్మడి కార్యాచరణపై ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంలో ఏకమైన కేంద్రం, రాష్ట్రాలు

ఇళ్ళు, రోడ్లు, జీవనోపాధి, లఖ్‌పతీ దీదీ, కృత్రిమ మేధ ఆధారంగా జాతీయ గ్రామీణాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

प्रविष्टि तिथि: 26 JUN 2026 6:55PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని పూసాలో ఉన్న భారతరత్న సిసుబ్రమణ్యం ఆడిటోరియంలో జూన్ 28, 29 తేదీల్లో 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సును నిర్వహిస్తున్నారుకేంద్ర వ్యవసాయరైతు సంక్షేమగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తారురెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుఉన్నతాధికారులునిపుణులు పాల్గొంటారువీరంతా కలిసి గ్రామీణ భారతదేశ సమగ్ర అభివృద్ధి గురించి చర్చించడంతో పాటుకీలకమైన ప్రధాన పథకాలను సమీక్షించిభవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగాగ్రామీణ భారతదేశంలో సమగ్రమైనసుస్థిరమైనమార్పుదాయక అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విస్తృతమైన జాతీయ చర్చను చేపట్టనుందికేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోఈ తరహాలో జరుగుతున్న మొట్టమొదటి భారీ జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు ఇదే కావడం విశేషంగ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది. ‘వికసిత్ గ్రామ్వికసిత్ భారత్’ సంకల్పాన్ని నిజం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌహాన్ తెలిపారువిబి-గ్రామ్ జి చట్టం - 2025 ను సమర్థవంతంగా అమలు చేయడంగ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికా ప్రక్రియలను బలోపేతం చేయడంవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారుప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనదీన్‌దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలుజాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి కీలక గ్రామీణాభివృద్ధి పథకాల అమలు తీరునువాటి పురోగతిని ఈ సదస్సు సమగ్రంగా సమీక్షిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.

సదస్సులో పాల్గొననున్న అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు

ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు హాజరు కానుండడం విశేషంవివిధ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుతో సంబంధం ఉన్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులువిధాన నిర్ణేతలువిషయ నిపుణులు కూడా చర్చల్లో పాల్గొంటారుఈ జాతీయ వేదిక రాష్ట్రాల అనుభవాలువినూత్న ఆవిష్కరణలుక్షేత్రస్థాయి సవాళ్ళపై బహిరంగ చర్చలకు వీలు కల్పించడం ద్వారా మరింత పటిష్టమైనఆచరణాత్మకమైన విధానాల రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేస్తుంది.

వివిధ అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు ఉత్తమ పద్ధతులపై దృష్టి

ఈ సదస్సులో గ్రామీణ గృహనిర్మాణంరహదారుల అనుసంధానంజీవనోపాధినైపుణ్యాభివృద్ధిసామాజిక భద్రత వంటి అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులుప్రత్యేక సెషన్లు ఉంటాయని శ్రీ చౌహాన్ తెలిపారువివిధ రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేసిన కార్యక్రమాలనూవినూత్న విధానాలనూ ఈ సదస్సులో ప్రదర్శించనున్నారుఇందువల్ల వాటిని దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించేందుకు అవకాశం కలుగుతుందిస్వయం సహాయ సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడంగ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై చర్చలతో 'లఖ్‌పతీ దీదీకార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారుగ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంచడంమార్కెట్ అనుసంధానాలను మెరుగుపరచడంపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు.

సాంకేతికత, కృత్రిమ మేధపై ప్రత్యేక దృష్టి

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో సాంకేతికత, కృత్రిమ మేధ వినియోగంపై ఈ సదస్సు ప్రత్యేకంగా చర్చిస్తుందిపథకాల అమలులో వేగాన్నీసామర్ధ్యాన్నీ పెంచేందుకు సాంకేతికత ఆధారిత పరిష్కారాలతో పాటు డిజిటల్ వేదికలునిరంతర పర్యవేక్షణపారదర్శకతజవాబుదారీతనంపై ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.

భవిష్యత్ కార్యాచరణ

సదస్సు రెండో రోజైన జూన్ 29న భవిష్యత్ కార్యాచరణకు తుది రూపు ఇచ్చే ముందు అన్ని రాష్ట్రాల సూచనలను స్వీకరించడానికి ప్లీనరీ సమావేశాలుమంత్రిత్వ శాఖల స్థాయి చర్చలు జరుగుతాయని శ్రీ చౌహాన్ తెలిపారుముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి కీలక నిర్ణయాలను ప్రకటించడంతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ సంకల్పాన్ని సాధించడంలో గ్రామాలు పోషించాల్సిన ప్రధాన పాత్రను వివరిస్తారు.

గ్రామీణ భారతదేశం కోసం సరికొత్త సంకల్పాలు స్పష్టమైన కార్యాచరణ

ఈ సదస్సు కేవలం ఒక సాధారణ సమీక్షా కార్యక్రమం మాత్రమే కాదని, గ్రామీణ భారతదేశం కోసం సరికొత్త సంకల్పాలనుఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే అద్భుతమైన అవకాశమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంనాయకత్వంలోని భారత ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా... దేశ ప్రగతి ప్రయాణంలో ప్రతి గ్రామం అంతర్భాగం అయ్యేలా చూడటమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ

సదస్సులో భాగంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రచురణలను కూడా విడుదల చేయనున్నారునీటి భద్రతగ్రామ అభివృద్ధి ప్రణాళికలుమహిళా సాధికారతగ్రామీణ జీవనోపాధిస్ఫూర్తిదాయకమైన విజయగాథలు వంటి విభిన్న రంగాలపై ఈ పుస్తకాలను రూపొందించారుగ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేయడంఅమలు చేయడంపర్యవేక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకూగ్రామ పంచాయతీలకూ ఆచరణాత్మక మార్గదర్శకాలుగాఉత్తమ విజ్ఞాన వనరులుగా ఇవి ఉపయోగపడతాయి.

 

***


(रिलीज़ आईडी: 2278322) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , हिन्दी , Tamil , Kannada , Malayalam