పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌ను ప్రపంచంతో పోటీ పడే పర్యాటక గమ్యస్థానంగా మార్చే సంస్కరణలకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్


పర్యాటక, ఆతిథ్య రంగాల్లో సులభతర వ్యాపార నిర్వహణపై పర్యాటక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సంప్రదింపులు

प्रविष्टि तिथि: 22 JUN 2026 6:55PM by PIB Hyderabad

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పర్యాటక మంత్రిత్వ శాఖ ఇవాళ న్యూఢిల్లీలో సులభతర వ్యాపార నిర్వహణపై పర్యాటక, ఆతిథ్య రంగ ప్రతినిధులతో పరస్పర చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత పర్యాటక రంగ వృద్ధి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు అవసరమైన సంస్కరణలపై చర్చించేందుకు ఎఫ్ఏఐటీహెచ్, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, డబ్ల్యూటీటీసీఐఐ, టీజీఎఫ్ఐ, ఏబీటీఓ, సీఐఐ, ఐఏఏపీఐ, ఎఫ్ఐసీసీఐ వంటి ప్రముఖ పరిశ్రమల సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

సంస్కరణల అజెండాపై కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా హోటళ్లు, ఆతిథ్య యూనిట్ల వర్గీకరణ ప్రక్రియ నుంచి లైసెన్సులను వేరు చేయటం వరకు ఇప్పటికే చేపట్టిన పలు కీలక కార్యక్రమాలను ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా పర్యాటక, ఆతిథ్య రంగ వ్యాపారాలకు మరింత అనువైన, పోటీతత్వం గల, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించటమే లక్ష్యంగా... పరిశ్రమ ప్రతినిధులు ప్రధాన అంశాలను, సిఫార్సులను పంచుకునేందుకు ఈ సంప్రదింపుల సమావేశం వేదికగా నిలిచింది.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ... దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడే పర్యాటక గమ్యస్థానంగా మార్చే సంస్కరణలను చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నిబంధనపరమైన అడ్డంకులను గుర్తించేందుకు, సులభతర వ్యాపార నిర్వహణ ద్వారా ఈ రంగం స్థిరమైన వృద్ధిని సాధించేలా చేయటానికి పరిశ్రమల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరపటం కీలకమని తెలిపారు.

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భువనేష్ కుమార్ మాట్లాడుతూ... హోటళ్ల వర్గీకరణ విధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తనిఖీల ఆధారిత మూల్యాంకనానికి బదులుగా స్వయం ప్రకటన ఆధారిత విధానాన్ని తీసుకురావటం, నిబంధనల భారాన్ని తగ్గించేందుకు నిర్దేశిత కాలపరిమితిలోగా చెక్‌లిస్ట్ అంశాలను, తప్పనిసరి సర్టిఫికేషన్ నిబంధనలను తగ్గించటం వంటి ప్రతిపాదనలను ఆయన తెలియజేశారు. ఈ ప్రతిపాదనలను పరిశ్రమ ప్రతినిధులు ఎంతగానో అభినందించారు.

పర్యాటక సంస్థల కోసం ప్రపంచస్థాయి పోటీతత్వం గల వ్యాపార వాతావరణాన్ని కొనసాగించటం ముఖ్యమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేశారు. వీసా ప్రక్రియలు, పన్నుల విధానాల హేతుబద్ధీకరణ, సులభతర అనుమతుల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించటం, లైసెన్సుల జారీకి కాలపరిమితిని నిర్ణయించటం, సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను భాగస్వాములను చేయటం, ఈ రంగం నిరంతర వృద్ధికి తోడ్పడేలా పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ గుర్తింపును మరింతగా పెంచేందుకు... పర్యాటక ప్రాంతాల మార్కెటింగ్, ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యతను కూడా పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తావించారు.

***


(रिलीज़ आईडी: 2277079) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam