రాజ్యసభ సచివాలయం
శ్రీ నీరజ్ డాంగీతో ప్రమాణం చేయించిన రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్
प्रविष्टि तिथि:
22 JUN 2026 6:13PM by PIB Hyderabad
రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ రాజస్థాన్ రాష్ట్రం నుంచి తిరిగి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు శ్రీ నీరజ్ డాంగీతో పదవీ ప్రమాణం చేయించారు. పార్లమెంట్ భవనంలో ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ నీరజ్ డాంగీ హిందీలో ప్రమాణాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ, రాజ్యసభలో సభానాయకుడు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా, రాజ్యసభ సభ్యుడు శ్రీ జైరామ్ రమేశ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి.సి. మోదీతో పాటు సచివాలయానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2277071)
आगंतुक पटल : 10