రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల వెంట వాహన మరమ్మతు, పంక్చర్ సేవల ఏర్పాటుకు ఎన్‌హెచ్ఏఐ ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 22 JUN 2026 3:34PM by PIB Hyderabad

జాతీయ రహదారులుఎక్స్‌ప్రెస్‌వేల వెంట ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికిసదుపాయాల లభ్యతను పెంచడానికి భారత జాతీయ రహదారుల సంస్థ యాజమాన్యంలోని నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్ఎంఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి పక్కన ఉండే సదుపాయాల కేంద్రాల (వే సైడ్ అమెనిటీస్) లీజుదారులు సాధ్యమైనంత త్వరగా వాహనాల మరమ్మతుపంక్చర్ సేవల కేంద్రాల ఏర్పాటుకు  ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని తన క్షేత్ర స్థాయి కార్యాలయాలను ఆదేశించింది. జాతీయ రహదారులపై ప్రయాణ అనుభూతిని మెరుగుపరచడంవాహనాలు నిలిచిపోయే సమయాన్ని తగ్గించడంరహదారి భద్రతను పెంచడంప్రయాణికులతో పాటు సరుకు రవాణాదారులకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

పలు జాతీయ రహదారులుఎక్స్‌ప్రెస్‌వేలపై పెద్ద సంఖ్యలో వాహన మరమ్మతుపంక్చర్ సేవల అవసరం ఉందని గుర్తించారు. ఈ సదుపాయాల వల్ల వాహనాలు మొరాయించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో రహదారి వినియోగదారులకు సకాలంలో సాంకేతిక సహాయం లభిస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు అనవసర ఇబ్బందులుప్రయాణంలో ఆలస్యభద్రతా పరమైన ప్రమాదాలను నివారించవచ్చు. 

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనా కింద దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన ఆధునిక సదుపాయాల కేంద్రాల వ్యవస్థను ఎన్‌హెచ్‌ఎల్ఎంఎల్ అభివృద్ధి చేస్తోంది. రాయితీదారులులీజుదారులతో కుదుర్చుకున్న ప్రస్తుత లీజు ఒప్పందాల ప్రకారం.. ప్రతి సదుపాయాల కేంద్రానికి నిర్దేశించిన తప్పనిసరి సౌకర్యాలతోపాటుఅదనంగా అనుమతించదగిన మరికొన్ని సదుపాయాలను కూడా అభివృద్ధి చేయవచ్చు. అధికారిక ఒప్పంద నిబంధనల ప్రకారం అనుమతించిన సదుపాయాల్లోనే వాహనాల మరమ్మతు దుకాణాలుపంక్చర్ సేవా కేంద్రాలు కూడా ఉన్నాయి. 

జాతీయ రహదారులుఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వారికివాణిజ్య వాహనదారులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే చోట అందించే సమీకృత సేవా కేంద్రాలుగా  ఈ వేసైడ్ అమెనిటీస్ పని చేస్తాయి. ఇలాంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల దేశంలో ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను సృష్టించాలనే విస్తృత లక్ష్యానికిరహదారి వినియోగదారులకు అంతరాయం లేని రవాణా సేవలను అందించాలనే సంకల్పానికి మరింత బలం చేకూరుతుంది. 

దేశవ్యాప్తంగా ప్రయాణికులురవాణా వ్యవస్థ ఆపరేటర్ల మారుతున్న అవసరాలను తీరుస్తూనేదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా సురక్షితమైనవినియోగదారులకు అనుకూలమైన జాతీయ రహదారి కారిడార్లను అభివృద్ధి చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2276776) సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Kannada , Malayalam