MIFF banner

అంతర్జాతీయ, భారతీయ కథా కథన ప్రతిభకు ఎంఐఎఫ్ఎఫ్ 2026 లో విశేష గుర్తింపు: పోలిష్ చిత్రం ‘సిల్వర్‘కు ప్రతిష్ఠాత్మక 'గోల్డెన్ కాంచ్' అవార్డు


ఇరాన్ చిత్రం ‘అండర్ ది స్నో‘ కు ఉత్తమ అంతర్జాతీయ షార్ట్ ఫిక్షన్ అవార్డు; ఉత్తమ భారతీయ షార్ట్ ఫిక్షన్ చిత్రంగా ‘స్మాల్ క్లౌడ్స్‘

దాదర్‌లోని రవీంద్ర నాట్య మందిరంలో వైభవంగా జరిగిన ముగింపు వేడుకతో 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్ఘనంగా ముగిసిందిఈ వేడుకలో డాక్యుమెంటరీషార్ట్ ఫిక్షన్యానిమేషన్ సినిమా రంగాలకు చెందిన ప్రతిభావంతులను చలనచిత్రోత్సవ ప్రతిష్ఠాత్మక  'గోల్డెన్ కాంచ్',  'సిల్వర్ కాంచ్అవార్డులతో సత్కరించారు.

ఈ చలనచిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారమైన బంగారు శంఖం (గోల్డెన్ కాంచ్అవార్డును పోలిష్ డాక్యుమెంటరీ చిత్రం 'సిల్వర్కైవసం చేసుకుందిమాసీజ్ కుబికీ నిర్మించిన ఈ చిత్రానికి నటాలియా కొనియార్జ్ దర్శకత్వం వహించారుపేదరికంశ్రమఆత్మగౌరవాన్ని ఒక కవితాత్మక దృక్పథంతోఅదే సమయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్వేషించిన చిత్రమిదిస్థానిక వాస్తవికతను ప్రపంచవ్యాప్త అన్యాయంపై ఒక లోతైన ఆలోచనగా మార్చిన విధానం అద్భుతం అని జ్యూరీ ఈ చిత్రాన్ని ప్రశంసించిందిచలనచిత్ర నిర్మాతల తరపున పోలిష్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్మినిస్టర్ ప్లీనిపోటెన్షియరీ మాల్గోర్జాతా వెజ్సిస్ గోలెంబియాక్ ఈ అవార్డును అందుకున్నారు.

చిత్ర దర్శకురాలు నటాలియా కొనియార్జ్చిత్ర నిర్మాత మాసీజ్ కుబికీ తరపున పోలిష్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్మినిస్టర్ ప్లీనిపోటెన్షియరీ మాల్గోర్జాతా వెజ్సిస్-గోలెంబియాక్ ఉత్తమ అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్ర ‘బంగారు శంఖం‘ అవార్డును అందుకుంటున్న చిత్రం.

జాతీయ పోటీలుభారతీయ కథల వైభవం 

జాతీయ స్థాయి పోటీలు సమకాలీన భారతీయ నాన్-ఫీచర్ సినిమా సత్తానువైవిధ్యాన్ని కళ్ళకు కట్టాయిఇందులో భాగంగా మూడు విశిష్ట చిత్రాలు ప్రతిష్ఠాత్మక ‘వెండి శంఖం‘ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి.

ఉత్తమ భారతీయ యానిమేషన్ చిత్రంగా సిల్వర్ కాంచ్ అవార్డును భువనేశ్ ఎంకుమార్ అలియాస్ బంజ్ దర్శకత్వం వహించినిర్మించిన ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్రం అంగాళమ్మన్ టెంపుల్ స్ట్రీట్ దక్కించుకుంది.  భవిష్యత్తును ధైర్యంగా ఆవిష్కరించిన తీరుసంప్రదాయంమార్పులపై పదునైన సామాజిక వ్యాఖ్యానంయానిమేషన్‌ను కేవలం దృశ్య రూపంగా కాకుండా శక్తివంతమైన సినీ భాషగా వినియోగించిన విధానాన్ని జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

ఎఫ్టీటీఐ నిర్మించిన స్మాల్ క్లౌడ్స్ చిత్రానికి ఉత్తమ భారతీయ షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్ విభాగంలో లభించిన సిల్వర్ కాంచ్ అవార్డును స్వీకరిస్తున్న ఎఫ్టీటీఐ వైస్ ఛాన్సలర్ శ్రీ ధీరజ్ సింగ్దర్శకుడు శ్రీ శుభమ్ సుమిత్ 

ఉత్తమ భారతీయ షార్ట్ ఫిక్షన్ చిత్రంగా సిల్వర్ కాంచ్ అవార్డు ‘స్మాల్ క్లౌడ్స్‘ కు దక్కిందిశుభమ్ సుమిత్ దర్శకత్వం వహించిధీరజ్ సింగ్ నిర్మించిన ఈ చిత్రం మంచు కురిసే సముద్ర తీర దృశ్యాలువర్షంతో తడిసిన ఇంటి ఆవరణల నేపథ్యంతో సాగే ఒక హృద్యమైన ఎదుగుదల కథాంశాన్ని ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరించిందిబాల్యంఎడబాటుకాల గమనాన్ని ఎంతో సున్నితంగా ప్రతిబింబించిన విధానం ప్రశంసనీయమని జ్యూరీ తన ప్రశంసా పత్రంలో కొనియాడింది.

ఉత్తమ భారతీయ డాక్యుమెంటరీ చిత్రంగా సిల్వర్ కాంచ్  పురస్కారాన్ని 'వాయి'  చిత్రం దక్కించుకుందిఈ చిత్రానికి సాయినాథ్ ఎస్ఉస్కైకర్ దర్శకత్వం వహించగాభరత్‌బాలా గణపతి నిర్మించారుఅంతరించిపోతున్న ఒక సంచార సంగీత సంప్రదాయాన్ని దృశ్య రూపంలో అద్భుతంగా ఆవిష్కరించిన తీరుజ్ఞాపకాలువారసత్వంసాంస్కృతిక కొనసాగింపును ఎంతో ఆత్మీయంగా అన్వేషించిన విధానం అభినందనీయమని జ్యూరీ  పేర్కొందినిర్మాత భరత్‌బాలా గణపతి తరపున దర్శకుడు ఉస్కైకర్జవాహర్ శర్మతో కలిసి ఈ అవార్డును అందుకున్నారు.

అంతర్జాతీయ పోటీలుప్రపంచ సినిమాకు పట్టాభిషేకం

అంతర్జాతీయ స్థాయి పోటీలు వివిధ ఖండాల వ్యాప్తంగా కళాత్మకకథాంశాల సరిహద్దులను సరికొత్తగా ఆవిష్కరించిన విశిష్ట చిత్రాలను సత్కరించాయి

ఉత్తమ అంతర్జాతీయ యానిమేషన్ చిత్రంగా 'సిల్వర్ కాంచ్పురస్కారాన్ని జర్మనీకి చెందిన 'మాయాస్ సాంగ్చిత్రం దక్కించుకుందిఈ చిత్రాన్ని ఫ్రాన్సిస్కా షోనెన్‌బెర్గర్జయకృష్ణన్ సుబ్రమణియన్ దర్శకత్వం వహించారుఅస్తిత్వంగుర్తింపుస్వీయ అన్వేషణల లోతైన ప్రయాణాన్ని సార్వత్రిక ఆకర్షణతోఊహాత్మకంగా,  భావోద్వేగభరితంగా ఆవిష్కరించిన కథా విధానం అద్భుతమని జ్యూరీ ఈ చిత్రాన్ని కొనియాడిందిచిత్ర నిర్మాతల తరపున లీడ్ యానిమేటర్స్టూడియో ప్రతినిధి సానికా కుల్కర్ణి ఈ అవార్డును అందుకున్నారు.

ఉత్తమ అంతర్జాతీయ షార్ట్ ఫిక్షన్ చిత్రంగా సిల్వర్ కాంచ్ పురస్కారాన్ని ఇరాన్ చిత్రం ‘అండర్ ది స్నో‘ చిత్ర దర్శకురాలు నఫీసే జారే, మరో నిర్మాత కొట్టుకతీర ప్రకాష్ తరపున అందుకుంటున్న మరో నిర్మాత దీపాంకర్ ప్రకాష్.

అంతర్జాతీయ పోటీల విభాగంలో ఉత్తమ షార్ట్ ఫిక్షన్ చిత్రంగా సిల్వర్ కాంచ్ పురస్కారాన్ని ఇరాన్ దేశానికి చెందిన 'అండర్ ది స్నోచిత్రం దక్కించుకుందిఈ చిత్రానికి నఫీసే జారే దర్శకత్వం వహించారుసామాజిక ఆంక్షల నడుమ ఒక యువతి తన వ్యక్తిగత నిజాలను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఎంతో సాహసోపేతంగాసున్నితమైన భావోద్వేగాలతో ఆవిష్కరించిన తీరుఎంతో నిశ్శబ్దంగా ఉంటూనే గుండెలను హత్తుకునేలా ఉపయోగించిన సినిమాటిక్ భాష అద్భుతమని జ్యూరీ ఈ చిత్రాన్ని ప్రశంసించిందిచిత్ర దర్శకురాలుసహ నిర్మాత కొట్టుకతీర ప్రకాష్పూయా సయీది తరపున నిర్మాత దీపాంకర్ ప్రకాష్ ఈ అవార్డును అందుకున్నారు.

ఎంఐఎఫ్ఎఫ్ 2026 చలనచిత్రోత్సవంలోనే అత్యంత విశిష్టమైన సృష్టిగా నిలిచితన శక్తివంతమైన మానవీయ కోణానికీ,  సార్వత్రిక ప్రాధాన్యతకకూ గానూ ఈ ఉత్సవం అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్న 'సిల్వర్చిత్రానికి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ కాంచ్ అవార్డును బహూకరించడంతో ఈ వేడుక ఘనంగా ముగిసింది.

ఇతర ప్రతిష్ఠాత్మక పురస్కారాలు:

శంఖం అవార్డులతో పాటు చలనచిత్ర దర్శకుడు ప్రదీప్ కెంచనూరు తన 'ది హగ్ ఆఫ్ ఎంప్టీనెస్చిత్రానికి గానూ ఎఫ్ఐపీఆర్ఈఎస్సీఐ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్ ను కూడా గెలుచుకున్నారు.  'ది ఓల్డ్ బుల్ నోస్ఆర్ వన్స్ న్యూచిత్రానికి గానూ మిలన్ కుమార్ 'ఉత్తమ విద్యార్థి చిత్రం'గా ఐడిపీఏ అవార్డును అందుకున్నారు

'రజాచిత్రానికి గానూ పూజా తోలానీని ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలుగా ప్రతిష్ఠాత్మక  'దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి అవార్డుతో సత్కరించారు. 'ది లాస్ట్ షెల్టర్చిత్రం 'వికసిత్ భారత్ వందేమాతరం 150 ఏళ్లు భారత్@2026' విభాగంలో 'ఉత్తమ షార్ట్ ఫిలిం ప్రత్యేక పురస్కారాన్నిసొంతం చేసుకోగాతైవాన్ చలనచిత్ర దర్శకుడు చువాన్-యింగ్ లియావో తన 'ది హోర్డర్స్చిత్రానికి గానూ అత్యంత సృజనాత్మక/ప్రయోగాత్మక చిత్రంగా ప్రమోద్ పతి స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.

జాతీయ పోటీల సాంకేతిక విభాగాలలో ‘కోవర్టిచిత్రానికి గానూ బిగ్యనా దహల్ ఉత్తమ సౌండ్ డిజైన్ పురస్కారాన్ని గెలుచుకోగా, 'మేడేచిత్రానికి గానూ అఖిల్ కృష్ణన్ ఉత్తమ ఎడిటింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు.  'స్మాల్ క్లౌడ్స్చిత్రానికి గానూ రణధీర్ బిస్వాస్ ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారానికి ఎంపికయ్యారు.

అంతర్జాతీయ పోటీల సాంకేతిక విభాగాలలో 'దేవా ఆజ్ పణ్ వ్హాయ్చిత్రానికి గానూ అభయ్ రుమ్డే ఉత్తమ సౌండ్ డిజైన్ పురస్కారాన్ని గెలుచుకోగారష్యాకు చెందిన 'అబౌట్ ది కౌచిత్రానికి ఎవ్గెనీ స్మిర్నోవ్మాక్సిమ్ స్మిర్నోవ్ ఉత్తమ ఎడిటింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు.  'టర్టిల్ వాకర్చిత్రానికి గానూ క్రిష్ మఖిజాను ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారంతో సత్కరించారు

ఈ మహోత్సవ ముగింపు వేడుకకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మపీఐబీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓఝాసమాచారప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్రీ అశుతోష్ గోవారికర్ఎన్ఎఫ్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్,  ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులుచలనచిత్ర ప్రేమికులు హాజరయ్యారుభారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో అద్భుతమైన కథలనుకథా వైవిధ్యాన్ని కొనియాడుతూ ఈ వారం రోజుల వేడుకను ఘనంగా ముగించారు.

గోల్డెన్ కాంచ్ పురస్కారాన్ని గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్రం 'సిల్వర్ను ముగింపు చిత్రంగా ప్రదర్శించారుఎంఐఎఫ్ఎఫ్ తదుపరి ఎడిషన్ 2028 వరకు వీడ్కోలు చెప్పే ముందుప్రేక్షకులకు ఇది  చివరి సినీమాటిక్ అనుభూతిని అందించింది.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2276402   |   Visitor Counter: 4

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Bengali , Gujarati