ఎంఐఎఫ్ఎఫ్‌లో సుదీర్ఘమైన స్నేహం, మానవ సంబంధాలకున్న శక్తిని చాటి చెప్పిన స్విస్ డాక్యుమెంటరీ
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)లో స్విస్ డాక్యుమెంటరీ ‘ఐ లవ్ యూ, ఐ లీవ్ యూ’ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా స్నేహం, మానసిక ఆరోగ్యం, శారీరక దారుఢ్యంపై ఆలోచనాత్మకమైన చర్చ జరిగింది. మోరిస్ ఫ్రీబర్గ్‌హాస్ దర్శకత్వం వహించిన ఈ బహుభాషా డాక్యుమెంటరీని లియోన్ ష్విట్టర్, ఫాబియానా సీట్జ్ సంయుక్తంగా నిర్మించారు. జ్యూరిచ్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ పురస్కారంతో పాటు ఆడియన్స్ అవార్డును కూడా ఈ చిత్రం గెలుచుకుంది. ఎంఐఎఫ్ఎఫ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మిడ్-ఫెస్ట్ ప్రదర్శనలో భాగంగా జరిగిన అంతర్జాతీయ ప్రీమియర్‌లో ప్రేక్షకులు, మీడియా ప్రతినిధుల నుంచి ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది.
ఈ డాక్యుమెంటరీ అస్తిత్వం, మూలాల అన్వేషణలో భాగంగా తన తండ్రి స్వదేశమైన అంగోలాకు సంగీత విద్వాంసుడు డినో చేసిన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. అయితే, ఈ ప్రయాణంలో డినో తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యకు గురికావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. స్నేహం, సంరక్షణ, కోలుకోవడం గురించి హృద్యంగా ఆవిష్కరించింది.

సినిమా పేరు గురించి మోరిస్ మాట్లాడుతూ... ‘ఐ లవ్ యూ, ఐ లీవ్ యూ’ అనేది ప్రేమ ముగిసిపోవడాన్ని సూచించదని తెలియజేశారు. ఒకరి పట్ల ఒకరు చూపించే బాధ్యతను, స్నేహ బంధాన్ని కొనసాగిస్తూనే.. కొన్ని పరిస్థితుల వల్ల మనుషులు విడిపోవాల్సి రావడాన్ని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పారు. మానసిక ఆరోగ్య సవాళ్లపై సమాజంలో మరింత అవగాహన పెంచేందుకు, తన కథను స్వయంగా చెప్పాలనే డినో ఆకాంక్ష నుంచే ఈ సినిమా రూపుదిద్దుకుందని ఆయన వివరించారు.
డినోతో తనకున్న సుదీర్ఘ స్నేహమే ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు కారణమని మోరిస్ ఫ్రీబర్గ్‌హాస్ చెప్పారు. ముందుగానే నిర్దేశించుకున్న స్క్రిప్ట్ ప్రకారం కాకుండా, నిజ జీవిత అనుభవాల ఆధారంగా ఈ చిత్రం సహజంగా సాగిందని చెప్పారు. కష్టమైన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కళ ద్వారా తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సినిమా ఒక సాధనంగా ఉపయోగపడిందని ఆయన అభివర్ణించారు. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతూ... సమాజంలో సానుభూతి, అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో వ్యక్తుల అంతర్మథనం గురించి తెలియకుండానే వారిని తప్పుగా అంచనా వేస్తుంటారని వెల్లడించారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మరింత విశాల దృక్పథంతో, కరుణతో, సున్నితంగా ఉండేలా ఈ సినిమా ప్రేక్షకులను ప్రోత్సహిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అర్థవంతమైన చర్చలు ప్రారంభం కావడానికి సినిమా గొప్ప సాధనంగా ఉపయోగపడుతుందని దర్శకుడు తెలియజేశారు. ఈ డాక్యుమెంటరీ కష్టకాలంలో స్నేహం, మానవ బంధాలకున్న శక్తిని ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే మానసిక ఆరోగ్యంపై అవగాహనను మరింత పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
***
रिलीज़ आईडी:
2275858
| Visitor Counter:
8