వన్యప్రాణులు, ప్రకృతి అద్భుతాల శతాబ్ది వేడుక: డేవిడ్ అటెన్‌బరోకు ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 నివాళి
డేవిడ్ అటెన్‌బరో శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్-2026) వేదికగా... డంకన్ చార్డ్ దర్శకత్వం వహించిన, స్వయంగా అటెన్‌బరో వ్యాఖ్యానం అందించిన 'సీక్రెట్స్ ఆఫ్ వైల్డ్ ఇండియా' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఎన్నో ప్రశంసలు పొందిన ఈ సిరీస్... ఆ దిగ్గజ ప్రకృతి ప్రేమికుడు రూపొందించిన మూడు భాగాల చరిత్రాత్మక డాక్యుమెంటరీ. ఇది భారత్‌లోని దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాలు, కఠినమైన ఎడారుల వంటి మూడు విభిన్న పర్యావరణ వ్యవస్థల్లో గల అపారమైన జీవవైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ మూడు భాగాల్లో, 'డెసర్ట్ లయన్స్' అధ్యాయం వాయువ్య భారత్‌లోని కఠినమైన, భయంకరమైన ఎడారిని చూపిస్తుంది. ఈ పరిస్థితులకు బాగా అలవాటుపడిన వారు మాత్రమే మనుగడ సాగించడానికి వీలుండే ప్రదేశం ఇది. ఈ డాక్యుమెంటరీ దాని అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపును సాధించింది. భారత పతాక ప్రతీకాత్మక వర్ణాలైన మూడు రంగులను ఇందులోని దృశ్యాల్లో పొందుపరిచారు. దీని కథన శైలి చక్కగా కథ చెబుతున్నట్లుగా సాగుతుంది, చూడటానికి ఆసక్తికరంగానూ ఉంటుంది. అటెన్‌బరో తన గళంతో... రుడ్యార్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్'కు ప్రాణం పోసినట్లుగా ఆ ఎడారిని వర్ణిస్తారు. చక్కని వర్ణనలతో సాగే మొత్తం వ్యాఖ్యానాన్ని... పెద్ద, స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే వివరణతో వచన రూపంలోనూ అందించారు.
ఈ చిత్రం సహజ ఆహార గొలుసుకు భంగం కలిగించకుండానే... వేటగాళ్లు-వేట మధ్య ఉన్న వైరుధ్యాన్ని చక్కగా చూపిస్తుంది. ఇది ప్రతి జాతి స్వభావాన్ని, తెలివిని ప్రదర్శిస్తుంది. వేటాడే ఒక ఆడపులి, తనపై ఎదురుతిరిగిన జింక పిల్లపై దాడి చేయకుండా దానిని వదిలిపెట్టే ఒక అద్భుతమైన దృశ్యాన్నీ ఈ చిత్రంలో చిత్రీకరించారు. ఇది వేటగాడు-వేట అనే విభజనను అధిగమించే మాతృ సహజ ప్రవృత్తికి ఒక నిశ్శబ్ద నిదర్శనం.
ఒక అత్యంత శృంగారభరితమైన సన్నివేశంలో భాగంగా పలు దశల్లో సాగే పులుల శారీరక కలయికను చిత్రీకరించారు. చెట్ల బెరడును తొలిచి తీపి రసం తీసే కీటకాలు చేసే ప్రత్యేకమైన, ఏకరీతి శృంగార పిలుపులతో దీనిని పోల్చి చూపించారు. ఈ కథనంలో గౌర్, హనుమాన్ లంగూర్, అడవి శునకాల వంటి జంతువులతో పాటు... చిత్రీకరణ కోసం తగిన సౌందర్యంగా పరిగణించని, మనకు బాగా తెలిసిన జంతువులనూ చూపించారు. చివరగా, అడవి పంది వంటి జంతువులు బురదలో ఉపశమనం పొందడం, జింకలు నీరు తాగడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడం వంటి సన్నివేశాలతో... తీవ్రమైన ఎడారి వేడి వన్యప్రాణుల ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ డాక్యుమెంటరీ మనకు తెలియజేస్తుంది.
అటెన్‌బరో నిశిత పరిశీలనా దృష్టి, జంతు జాతులపై ఆయనకున్న లోతైన జ్ఞానం ఈ డాక్యుమెంటరీని చూడడం ఆనందదాయకంగా చేస్తాయి. మానవ కేంద్రిత దృక్పథం పెరుగుతున్న ఈ కాలంలో, మనతో పాటు ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఇతర జీవుల సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక నూతనమైన, లోతైన అన్వేషణ.
***
रिलीज़ आईडी:
2275724
| Visitor Counter:
10