రక్షణ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 నిర్వహణకు సన్నాహాలు
प्रविष्टि तिथि:
19 JUN 2026 12:58PM by PIB Hyderabad
శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, అంతర్గత సమతౌల్యం.. ఇవి వాయు యోధులకు కావలసిన తప్పనిసరి గుణాలు. ఈ గుణాలను నిలబెట్టుకుంటూ, భారతీయ వాయు సేన (ఐఏఎఫ్) ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి కామన్ యోగా ప్రోటోకాల్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. మెరుగైన ఆరోగ్యం, దృఢత్వం, సమగ్ర సంక్షేమాల దిశగా ఏఐఎఫ్ నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా యోగాభ్యాస కార్యక్రమాన్ని ఐఏఎఫ్ నిర్వహించనుంది. దీనిలో ఉత్తరాన లేహ్‌లోని ఎత్తయిన పర్వతాల నుంచి దక్షిణాన కార్ నికోబార్‌లో సముద్ర తీరాల వరకూ, తూర్పున సరిహద్దు ప్రాంతంలోని తవాంగ్ నుంచి పశ్చిమాన పవిత్ర నగరం ద్వారకా వరకూ వివిధ ప్రాంతాలు జతపడనున్నాయి. వాయు సైనికులు, వారి కుటుంబాలకు తోడు బడి పిల్లలు, ఎన్‌సీసీ కేడెట్లు కూడా దేశవ్యాప్తంగా వేర్వేరు వాయు సేన స్టేషన్లలో ఏర్పాటు చేసే యోగాభ్యాస కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఆరోగ్యం, సంక్షేమం, యోగాకున్న శాశ్వత విలువలను ప్రోత్సహించడం పట్ల ఐఏఎఫ్ నిబద్ధతను ఈ కార్యక్రమం సూచిస్తోంది.
‘‘ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగాభ్యాసా’న్ని ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇది మనిషి జీవితంలోని అన్ని దశల్లోనూ శారీరక శక్తి, మానసిక ధీరత్వం, సమగ్ర సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో యోగా పోషించే పాత్రను ప్రస్తావిస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ, మరింత సమతుల్య జీవనాన్ని గడపటానికి మనుషులకు యోగా స్పూర్తిని అందిస్తుంది. అంతేకాక అంతర్గత శక్తితో పాటు జాగరూకతను కూడా పెంపొందింప చేస్తుంది.
ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి దేశ ప్రజానీకం సన్నద్ధం అవుతున్న క్రమంలో, యోగాకున్న మార్పు తెచ్చే శక్తిని భారతీయ వాయు సేన చాటిచెబుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందితో జతపడటానికి ఎదురుచూస్తోంది.
శారీరకంగా బలాన్ని పుంజుకుందాం.. మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం.. ఉత్సాహంలో ఏకతాటిమీద నిలబడదాం.
***
(रिलीज़ आईडी: 2275388)
आगंतुक पटल : 11