ఉప రాష్ట్రపతి సచివాలయం
నషా ముక్త్ పరిసర్ అభియాన్ పరిధిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలకు ఉపరాష్ట్రపతి ప్రశంస
మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యానికి సహకరిస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన 53,000 మందికి పైగా విద్యార్థులు
మాదకద్రవ్య రహిత విద్యా ప్రాంగణాలు కార్యక్రమంలో పాల్గొనాలని విశ్వవిద్యాలయాలు , విద్యాసంస్థలకు పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
18 JUN 2026 2:05PM by PIB Hyderabad
నషా ముక్త పరిసర్ అభియాన్ కార్యక్రమం పరిధిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని భారత ఉపరాష్ట్రపతి, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రశంసించారు.
ఈ ఏడాది ప్రారంభంలో విశ్వవిద్యాలయంలో మాదకద్రవ్య రహిత ప్రాంగణ ప్రచారాన్ని, ఈ-ప్లెడ్జ్ వేదిక ను ప్రారంభించిన సందర్భాన్ని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో గుర్తు తెచ్చుకున్నారు. నషా ముక్త భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా మారాలనీ, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా గళం విప్పాలని విద్యార్థులను ఆయన కోరారు.
ఈ ప్రచార లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 53,000 మందికి పైగా విద్యార్థులు సామూహిక ప్రతిజ్ఞ చేశారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన, బలమైన, సుభిక్షమైన దేశాన్ని నిర్మించడంలో గణనీయమైన సహకారాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో భాగం కావాలని. తమ విద్యార్థులను ఈ ప్రచారంలో భాగం చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదకద్రవ్య రహిత భారత్ కలను సాకారం చేయడంలో సమష్టి ప్రయత్నం, యువతలో అవగాహన అవసరమని స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2274930)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4