ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగ అంతర్జాతీయ ప్రస్థానం, దాని శాశ్వత వారసత్వాన్ని తెలియజేసే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 JUN 2026 5:04PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

మన ప్రాచీన గ్రంథాల నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందే వరకు యోగ శాస్త్రం.. సరిహద్దులు దాటి ఎలా విస్తరించిందో ఈ కథనం వివరిస్తుంది. అదే సమయంలో ఇది భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలోనే తన మూలాలను కలిగి ఉందని స్పష్టం చేస్తోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యోగా వేడుకలు.. కాలాతీతమైన ఈ సంప్రదాయం పట్ల పెరిగిన అంతర్జాతీయ గుర్తింపునకు నిదర్శనమని తెలియజేసింది. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ తన వ్యాసంలో యోగ ప్రయాణాన్ని అద్భుతంగా వివరించారు. ప్రాచీన గ్రంథాల నుంచి అంతర్జాతీయ గుర్తింపు వరకు.. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో ముడిపడి ఉంటూనే యోగ సరిహద్దులను ఎలా దాటిందో పేర్కొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యోగా వేడుకలు, ఈ కాలాతీత సంప్రదాయం పట్ల సమాజంలో పెరిగిన గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.”

***


(रिलीज़ आईडी: 2274927) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam