ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నౌకా వాణిజ్య అనుసంధానం, సహకారానికి గల అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో రోడాల్ఫ్ సాడేతో చర్చించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 JUN 2026 6:37PM by PIB Hyderabad

నౌకా వాణిజ్య అనుసంధానంప్రపంచ స్థాయిలో నౌకాయాన ధోరణులు, భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో శ్రీ రోడాల్ఫ్ సాడేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.

నౌకా నిర్మాణంకంటైనర్ల తయారీనౌకా వాణిజ్యంలో డిజిటల్ ఆవిష్కరణలుసరుకు రవాణానైపుణ్యాభివృద్ధి రంగాల్లో మరింత సహకారానికి గల అవకాశాలపై చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు.

రోజురోజుకీ విస్తరిస్తున్న భారత ఓడరేవు మౌలిక సదుపాయాలు ప్రపంచ నౌకా వాణిజ్య రంగ నాయకులకు ఆశాజనకమైన అవకాశాలను అందిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎక్స్ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

సీఎంఏ సీజీఎమ్‌ చైర్మన్, సీఈవో శ్రీ రోడోల్ఫ్ సాడేతో నౌకా వాణిజ్య అనుసంధానంప్రపంచ నౌకాయాన ధోరణులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత నౌకా వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవకాశాలపై ఫలవంతమైన చర్చ జరిగింది.

నౌకా నిర్మాణంకంటైనర్ తయారీనౌకా వాణిజ్యంలో డిజిటల్ ఆవిష్కరణలు, సరుకు రవాణా, నైపుణ్యాభివృద్ధిలో మరింత సహకారం కోసం గల అవకాశాలను చర్చించాం.

విస్తరిస్తున్న భారత ఓడరేవు మౌలిక సదుపాయాలు ప్రపంచ నౌకా వాణిజ్య రంగ నాయకులకు మంచి అవకాశాలను అందిస్తున్నాయి.

@cmacgm”


(रिलीज़ आईडी: 2274921) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada