MIFF banner

19వ ఎంఐఎఫ్ఎఫ్-2026లో విజయవంతంగా ముగిసిన వేవ్స్ డాక్ బజార్ రెండో సంచిక


డాక్యుమెంటరీ ఫిలిం మేకర్లకు అంతర్జాతీయ అవకాశాలను బలోపేతం చేసేలా19 దేశాల నుంచి 155 ఎంట్రీలు, 100కు పైగా బీ2బీ సమావేశాలు, వివిధ ప్రాజెక్టులకు దక్కిన అవార్డులు

19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)-2026లో వేవ్స్ డాక్ బజార్ రెండో సంచిక విజయవంతంగా ముగిసింది. డాక్యుమెంటరీ చలనచిత్ర దర్శకులు ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, బ్రాడ్‌కాస్టర్లు, పరిశ్రమ నిపుణులతో అనుసంధానం కావడానికి ముఖ్యమైన వేదికగా తన పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది.

మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో కథల వివరణ, నెట్‌వర్కింగ్ సెషన్లు, పరిశ్రమ నిపుణులతో చర్చలను నిర్వహించారు. తద్వారా ఎంపిక చేసిన చలనచిత్ర దర్శకులకు తమ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడానికీ, పోస్ట్-ప్రొడక్షన్‌కూ, పంపిణీకీ అవసరమైన సాయాన్ని పొందే అవకాశం దక్కింది.

ముగింపు కార్యక్రమంలో పలు ఉత్తమ డాక్యుమెంటరీలకు పురస్కారాలు అందించారు.

ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలకు నిర్మాణానంతర సాయాన్ని అందజేసే ప్రసాద్ ల్యాబ్స్ పురస్కారాలను ప్రసాద్ ల్యాబ్స్ జనరల్ మేనేజర్ శ్రీ నితిన్ పింగ్లే అందించారు.

ప్రసాద్ ల్యాబ్స్ పోస్ట్-ప్రొడక్షన్ అవార్డు ద్వారా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంపిక చేసిన ప్రాజెక్టులకు గరిష్ఠంగా 50 గంటల పాటు ఉచిత 4కే డిజిటల్ ఇంటర్మీడియట్ (డీఐ) సేవలను అందించారు. తద్వారా ఆయా చిత్రాలకు నిర్మాణానంతర సాయాన్ని చేకూర్చారు. ఈ అవార్డును అందుకున్న విజేతల వివరాలు

  • విజేత:  ఆన్ ఏ గుడ్ నోట్

    దర్శకులు: కరిష్మారావు

    నిర్మాత: విశ్వేష్ ఎస్. ప్రసాద్

  • విజేత: ఇట్ టేక్స్ ఏ విలేజ్

    దర్శకులు: ఇంద్రజీత్ మోర్

    ఎడిటర్: ఆకాంక్ష కల్హే

    వీటికి అదనంగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) అందించే ఐఐసీటీ పోస్ట్-ప్రొడక్షన్ అవార్డులను అందజేశారు. వీటిని ఐఐసీటీ అకడమిక్స్ డైరెక్టర్ శ్రీ సతీష్ నారాయణన్ ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు.. డాక్యుమెంటరీ నిర్మాణంలో కనబరిచిన ప్రతిభను గుర్తించడంతో పాటు, ఎంపిక చేసిన ప్రాజెక్ట్‌ల పోస్ట్ ప్రొడక్షన్‌కు అవసరమైన సాయాన్ని అందించాయి.

50 గంటల 4కే డిజిటల్ ఇంటర్మీడియట్ (డీఐ) సేవలకు 50 శాతం రాయితీని ఐఐసీటీ పోస్ట్ ప్రొడక్షన్ పురస్కారం అందిస్తుంది. అవార్డు విజేతలు:

  • విజేత: అడియు డిల్లీ

    దర్శకులు: నందన్ సక్సేనా, కవితా బల్

  • విజేత: దో చార్ దిన్

    దర్శకులు: సాన్యా ఆనంద్

    నిర్మాత: నవ్య బజాజ్

రీబోర్న్ ఇండియా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ పురస్కారాన్ని రీబోర్న్ ఇండియా ఫిలిమ్స్‌కు చెందిన రాహుల్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్ అందించారు. ఈ పురస్కారానికి ఎంపికైన ప్రాజెక్టులకు పంపిణీ అవకాశాలను కల్పించి, మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా తోడ్పాటునందిస్తారు. దీనిలో భాగంగా రూ.7 లక్షల విలువైన పంపిణీ సాయంతో పాటుగా, ఈ చిత్రాలను థియేటర్లలో విడుదల చేసేందుకు 10 స్క్రీన్లు కేటాయిస్తారు.

  • విజేత: ఆన్ ఏ గుడ్ నోట్ బై

    దర్శకులు: కరిష్మా రావు

    నిర్మాత: విశ్వేష్ ఎస్. ప్రసాద్

డాక్యుమెంటరీ, లఘుచిత్రాల ప్రాజెక్టులకు ఒక్కొక్కదానికి లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని ఎన్ఎఫ్‌డీసీ మొదటిసారి ప్రవేశపెట్టింది. ఈ పురస్కారాలను ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్దూం ప్రదానం చేశారు.

నగదు పురస్కార విజేతలు:

  • కుంచోక్ అండ్ హిజ్ మెనీ మూన్స్,

    దర్శకులు, ఎడిటర్: అశోక్ మీనా

  • ది గర్ల్ బినీత్ ది సన్,

    దర్శకులు: మధురిమ మైటీ

  • టుక్రో టుక్రో పృత్భి

    దర్శకులు: అస్మితా పాల్

    నిర్మాత: అరుణిమా చౌధరి

ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాశ్ మగ్దూం ప్రసంగించారు. వివిధ విభాగాల్లో 150 కి పైగా ఎంట్రీలు రావడమే వేవ్స్ డాక్ బజార్‌కు వచ్చిన విశేష స్పందనకు నిదర్శనమనీ, డాక్యుమెంటరీ దర్శకుల కోసం ఒక ప్రత్యేకమైన వేదికకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోందనీ తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్ఎఫ్‌డీసీ మరింత బలోపేతం చేస్తుందనీ, నాన్-ఫిక్షన్ సినిమా రంగంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న ప్రతిభావంతులకు తోడ్పాటు అందిస్తుందనీ ఆయన హామీ ఇచ్చారు.

డాక్యుమెంటరీ రంగం నుంచి ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. 19 దేశాలూ, 35 భాషల నుంచి 155 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో నిర్మాతలకు కథ వివరించడం, మార్కెట్ కార్యకలాపాల కోసం 12 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. అలాగే 100కు పైగా బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) సమావేశాలు జరిగాయి. ఇవి సహ-నిర్మాణం, నిధులు, పంపిణీ భాగస్వామ్యాలకు అవకాశాలను కల్పించాయి.

అర్థవంతమైన డాక్యుమెంటరీ కథనానికి తోడ్పాటు అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త ప్రాజెక్టులు చేరువయ్యేలా చేయడమనే ఉమ్మడి లక్ష్యంతో వేవ్స్ డాక్ బజార్ రెండో ఎడిషన్ ముగిసింది.

 

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


రిలీజ్ ఐడి: 2274753   |   Visitor Counter: 58