19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి సరికొత్త ఆసియా సినిమాను తీసుకొచ్చిన బూసన్: నెక్ట్స్ వేవ్
వైవిధ్యమైన ఇతివృత్తాలను, ప్రత్యేక కథన శైలులను ప్రతిబింబించేలా లఘుచిత్రాల ఎంపిక
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో (ఎంఐఎఫ్ఎఫ్) ‘బూసన్: నెక్ట్స్‌వేవ్’ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చలనచిత్రోత్సవాల్లో ఒకటైన బూసన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (బీఐఎఫ్ఎఫ్) నుంచి ఎంపిక చేసిన కొన్ని అత్యుత్తమ లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు.
అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర సంస్కృతి, చైతన్యవంతమైన దేశీయ చిత్ర పరిశ్రమ సహకారంతో సినిమా నగరంగా బూసన్ ఖ్యాతి గాంచింది. బూసన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, బూసన్ అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లాంటి ప్రసిద్ధ కార్యక్రమాలకు ఈ నగరం వేదికగా ఉంది. స్క్రీనింగులు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు, పరిశ్రమతో అనుసంధానం, వర్కుషాపుల ద్వారా నూతన దర్శకులను ప్రోత్సహించే ఒక బలమైన వ్యవస్థను అందిస్తోంది. 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బూసన్: నెక్స్ట్ వేవ్ విభాగంలో.. విభిన్నమైన ఇతివృత్తాలు, ప్రత్యేకమైన నిర్మాణ శైలితో రూపొందిన అయిదు చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.
40 ఏళ్లకు పైగా కొరియా అంతటా పర్యటిస్తూ.. పూలను ఫొటోలు తీసే జంగ్ మ్యుంగ్ కిమ్ అనే ఫొటోగ్రాఫర్ జీవితాన్ని ‘ఎ మ్యాన్ హూ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఫ్లవర్స్’ చిత్రం ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తన పనిలోనే ఆనందాన్నీ, అర్థాన్నీ ఆయన అన్వేషిస్తున్నారు. ప్రకృతి, ఫోటోగ్రఫీపై ఉన్న అభిలాష ఆయన జీవితాన్ని ఎలా అర్థవంతం చేసిందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా వివరిస్తుంది.
image.png
ప్యారిస్‌లో జరుగుతున్న కొడుకు పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఒక చైనీస్ హోమోసెక్సువల్ తండ్రి కథను ‘డిలే’ చిత్రం మన ముందు ఉంచుతుంది. ఊహించని విధంగా ఎదురైన జాప్యాలు, మార్పులు ఆయన ప్రయాణాన్ని మలుపు తిప్పుతాయి. ఈ అనుభవాల ద్వారా కుటుంబ సంబంధాలు, భావోద్వేగ దూరం, తండ్రీకొడుకుల బంధంలోని సున్నితమైన కోణాలను ఈ చిత్రం అన్వేషిస్తుంది.
image.png
ఈ కార్యక్రమంలో ‘నాయిస్ క్యాన్సిలేషన్’ అనే చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. పనిచేసే చోట తగిలిన గాయానికి నష్టపరిహారం పొందేందుకు పోరాటం చేసే మిజు అనే మహిళ కథ ఇది. అలాగే, తన పై ఫ్లాట్ నుంచి నిరంతరం వినిపించే అరుపులు ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. వాటి గురించి తెలుసుకొనే క్రమంలో ఆమె అంతుచిక్కని, ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతుంది. ఈ పరిస్థితి ఆమె దైనందిన జీవితంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది.
image.png
‘ఇంటర్‌ఫేస్’, ‘ఇట్ సౌండ్స్ లౌడర్ ఆన్ రెయినీ డేస్’ అనే మరో రెండు చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ కలసి సమకాలీన ఆసియా సినిమా వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి వస్తున్న నూతన దర్శకుల సృజనాత్మక దృష్టిని ప్రత్యేకమైన కథనాలతో, ఆవిష్కరణాత్మక సినిమా శైలులతో బూసన్ నెక్స్ట్ వేవ్ కార్యక్రమం తెలియజేస్తోంది.
***
रिलीज़ आईडी:
2274324
| Visitor Counter:
5