నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

స్కూల్ ఇన్నోవేషన్ ల్యాబుల ద్వారా ద్వైపాక్షిక ఆవిష్కరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ


అటల్ ఇన్నోవేషన్ మిషన్, లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ చేపట్టిన ఆవిష్కరణాత్మ కార్యక్రమం...
ఉమ్మడి ఆవిష్కరణల వ్యవస్థ ద్వారా భారత్, ఫ్రాన్స్‌లోని యువ ఆవిష్కర్తల అనుసంధానంలో కీలకం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ప్రారంభించిన భారత్ ఇన్నోవేట్స్ - 2026 నేపథ్యంలో... ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై పూర్తయిన సంతకాలు

प्रविष्टि तिथि: 14 JUN 2026 8:12PM by PIB Hyderabad

ఫ్రాన్స్/ఢిల్లీభారత్ఫ్రాన్స్ మధ్య ఆవిష్కరణల ఆధారిత సహకారాన్ని బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఉమ్మడి సంకల్పంతో... రెండు దేశాలూ కలసి ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశాయిరెండు దేశాల్లోని యువ ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేలా నీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి.

భారతదేశంలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్విధానం అందించిన స్ఫూర్తితో ఫ్రాన్స్‌లో మొట్టమొదటి పాఠశాల ఆవిష్కరణ ప్రయోగశాలను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందిరెండు దేశాల విద్యార్థుల మధ్య సహకారానికీఆవిష్కరణ వ్యవస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికీద్వైపాక్షిక ఆవిష్కరణ సహకారాన్ని బలోపేతం పెంపొందించడానికీ నిర్మాణాత్మక వేదికను రూపొందిస్తుంది.

ఈ సహకారాన్ని అధికారికం చేసే ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (ఎల్ఓఐనీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లాలా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ పియర్ అలాస్ ఈ రోజు ఫ్రాన్స్‌లో పరస్పరం మార్చుకున్నారు.

భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సరిహద్దులకు అతీతంగా ఆవిష్కరణ కార్యక్రమాలనూవ్యాపార ఆలోచనలనూ ఇచ్చిపుచ్చుకోవడాన్ని పెంపొందించే వేదికగా ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ పనిచేస్తుందిఅలాగే రెండు దేశాల ఆవిష్కరణ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందిజ్ఞాన వినిమయంసామర్థ్య నిర్మాణంఉమ్మడి ఆవిష్కరణ కార్యకలాపాల ద్వారా వాస్తవ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను సంయుక్తంగా ఆవిష్కరించే వీలును యువ ఆవిష్కర్తలకు ఏటీఎల్ బ్రిడ్జ్ అందిస్తుందిఅలాగే ప్రాథమిక స్థాయిలో ఆవిష్కరణ సామర్థ్యాలను పెంపొందిస్తుందియువ ఆవిష్కర్తలువిద్యావేత్తలుఈ రంగానికి చెందిన నిపుణుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా.. శక్తిమంతమైన ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడంభారత్-ఫ్రాన్స్ మధ్య పరస్పరం ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026లో భాగంగా ఈ ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని చేపట్టారుభారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య ఆవిష్కరణల ఆధారిత సహకారాన్ని బలోపేతం చేయడంభవిష్యత్తు అవసరాలకు సిద్ధమైన ప్రతిభను ప్రోత్సహిండమనే ఉమ్మడి లక్ష్యాలను ఇది ప్రతిబింబిస్తుందిరెండు దేశాల మధ్య పాఠశాల స్థాయి ఆవిష్కరణల్లో అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించే దిశగా వేసిన ముందడుగును ఈ కార్యక్రమం సూచిస్తుందిఅలాగే విద్యార్థులుఉపాధ్యాయులుఆవిష్కరణ వ్యవస్థల మధ్య అర్థవంతమైన చర్చలను ప్రోత్సహిస్తుంది.

వసుధైవ కుటుంబం- ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భారతీయ నాగరికతా సూత్రం ఆధారంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందిజ్ఞానాన్నీఆవిష్కరణలనూప్రగతినీ పంచుకున్నప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందనే విశ్వాసాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందిఅటల్ టింకరింగ్ ల్యాబు (ఏటీఎల్విధానాన్నిఆవిష్కరణల శైలిని పంచుకోవడం ద్వారా విజయవంతమైన నమూనాను విస్తరించడం మాత్రమే కాకుండా భాగస్వామ్యంస్నేహంసమష్టి వృద్ధి సాధించాలనే స్ఫూర్తిని కూడా భారతదేశం చాటి చెబుతోంది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికున్న ప్రాధాన్యాన్ని నీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా వివరించారు. ‘‘భారతదేశ ఆవిష్కరణల ప్రయాణంపై ప్రపంచానికి ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో.. దేశీయంగా ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే నమూనాలనుపరిష్కారాలను అందించే స్థాయికి భారత్ ఎదిగిందిమనం వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా ముందుకు వెళుతున్నాంఈ తరుణంలో.. ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ లాంటి కార్యక్రమాలు ఆవిష్కరణలనూఔత్సాహిక పారిశ్రామిక రంగాన్నీఅంతర్జాతీయ సహకారాన్నీ పెంపొందించడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయిభారతదేశంలోని అటల్ టింకరింగ్ ల్యాబు వ్యవస్థతో అనుసంధానిస్తూ ఫ్రాన్స్‌లో స్కూల్ ఇన్నోవేషన్ ల్యాబును ఏర్పాటు చేయడం అంటే.. నేర్చుకోవడానికి కొత్త ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదుప్రాంతంతో సంబంధం లేకుండా యువతరం అందరికీ ఆవిష్కరించేసృష్టించేనాయకత్వం వహించే అవకాశం దక్కాలనే ఒక గొప్ప ఆలోచనను పంచుకోవడం’’ అని తెలియజేశారు.

లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ పియర్ ఆలస్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించే శక్తిమంతమైన సాధనమే విద్యఅన్వేషణప్రయోగాత్మక అభ్యాసం ద్వారా సైన్సుటెక్నాలజీని నేర్చుకొనేలాపరిశోధించేలా యువతలో స్ఫూర్తి నింపడం అవసరంచిన్న వయసు నుంచే సృజనాత్మకతప్రయోగాలుఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించే ప్రత్యేక కార్యక్రమమే అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ఆవిష్కరణాత్మక ఆలోచనా ధోరణిని ప్రోత్సహించేందుకుఅంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి గత ఏడేళ్లుగా భారత్ఫ్రాన్స్‌లో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందిఅటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా యువతనుఉమ్మడి ఆవిష్కరణ భవిష్యత్తును తీర్చిదిద్దేలా రెండు దేశాల మధ్య భాగస్వామ్యంలో వేసిన సరికొత్త ముందడుగు ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని ఆమె అన్నారు.

దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక సంస్కృతిని పెంపొందించడానికివికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు తోడ్పడాలనే సంకల్పంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)ను ప్రారంభించారుఇది ప్రారంభమైన నాటి నుంచి పాఠశాలలువిశ్వవిద్యాలయాలుపరిశోధనా సంస్థలుఅంకుర సంస్థలుపరిశ్రమల్లో ఆవిష్కరణల వ్యవస్థలను సిద్ధం చేసిప్రోత్సహించే ప్రతిష్ఠాత్మక జాతీయ కార్యక్రమంగా ఆవిర్భవించిందిఏఐఎం కింద ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు.. సృజనాత్మకతసమస్యల పరిష్కారంఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలువ్యాపార నైపుణ్యాల్లో లక్షలాది విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల ఆధారిత ఆవిష్కరణల వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగాయి.

గడచిన దశాబ్దంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణ వ్యవస్థల్లో ఒకదానిని భారత్ నిర్మించింది. ఈ పరివర్తనను సాధ్యం చేసిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం). నీతి ఆయోగ్ చేపట్టిన ఈ కార్యక్రమం.. తరగతి గది నుంచి అంకుర సంస్థలుపరిశ్రమల వరకు ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది.

2016 నుంచి ఇప్పటి వరకూ భారత దేశంలో 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటయ్యాయివీటి ద్వారా 11 మిలియన్ల మందికి పైగా విద్యార్థులకు డిజైన్ థింకింగ్రోబోటిక్స్ఎలక్ట్రానిక్స్, 3డీ డిజైన్ అండ్ ప్రింటింగ్ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ఇతర నూతన టెక్నాలజీలను నేర్చుకొనే అవకాశం లభించిందిఆసక్తితోనే ఆవిష్కరణ మొదలవుతుందనీ ఏటీఎల్ కార్యక్రమం తెలియజెప్పిందిఅలాగే పరిశోధనకుసృజనకుప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వాతావరణం కల్పించినప్పుడు యువ మేధ వికసిస్తుందని కూడా తెలియజేస్తోంది.

‘‘యువత చేసిన ఆవిష్కరణలుకృషిపైనే భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారుఈ దార్శనికతకు ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జి నిదర్శనంగా నిలుస్తోందిఅలాగే మరింత ఆవిష్కరణాత్మకమైనసుభిక్షమైన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో స్నేహానికీసహకారానికీయువ ఆవిష్కర్తలువిద్యార్థి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తిపై ఉన్న ఉమ్మడి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.

 

***

 


(रिलीज़ आईडी: 2273218) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam