ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైతుల సంక్షేమం, సాధికారత కల్పనపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 JUN 2026 8:06PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

గత 12 సంవత్సరాల్లో రైతుల సంక్షేమానికీవారికి సాధికారతను కల్పించడానికి చేపట్టిన అపూర్వ కృషిని ఆ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించిందిఅన్నదాతలను దృష్టిలో పెట్టుకొని అమలుచేసిన వివిధ కార్యక్రమాలు వారి జీవితాల్లో చెప్పుకోదగ్గ సానుకూల మార్పులను తీసుకువచ్చాయని ఆ వ్యాసం పేర్కొనడంతో పాటు వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్న తీరును కూడా వివరించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘
రైతు సోదరీసోదరుల సంక్షేమంతో పాటు వారికి సాధికారతను కల్పించే దిశగా ఇదివరకెన్నడూ ఎరుగని కార్యక్రమాలను గత 12 సంవత్సరాల్లో అమలుచేశారుఅన్నదాతల కోసం మేం తీసుకువచ్చిన పథకాలతో వారి జీవితాల్లో అనేక సకారాత్మక మార్పులు వచ్చాయివ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న ఈ పెనుమార్పులను గురించి  కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ గారు తాను రాసిన ఒక వ్యాసంలో సమగ్రంగా వివరించారు’’ అని తెలిపింది.

***


(रिलीज़ आईडी: 2272880) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam