ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగాతో పాటు ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘకాలం జీవించడంపై ఓ వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 JUN 2026 8:07PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
శక్తిమంతమైన దేశాన్నీమరింత ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాన్నీ నిర్మించాలంటే దేశ పౌరులు వారి జీవనంలో ఏ దశలో అయినా సరేఆరోగ్యవంతులుగాచురుకుగాఫలితాలను సాధించిపెట్టేవారుగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించిందిభారతదేశ ప్రాచీన జ్ఞానంలో బోధిస్తున్న ప్రకారం.. మనిషి ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్రను పోషించే సమగ్ర విధానాన్ని యోగా అందిస్తుందనీమనిషి మంచి ఆరోగ్యంతో ఉంటూ దీర్ఘకాలం జీవించి ఉండేలా తోడ్పడుతుందనీ ఈ వ్యాసం స్పష్టం చేసింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని  ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ను పండుగలాగా జరుపుకోవడానికి  ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్న క్రమంలోకేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ ఒక వ్యాసాన్ని రాశారుఅందులోగొప్ప దేశాన్నీమరింత ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాన్నీ నిర్మించడానికి దేశ పౌరులను వారి జీవనంలో ఏ దశలో అయినా ఆరోగ్యవంతులుగానూచురుకుగానూఫలితాలను సాధించిపెట్టేవారుగానూ ఉండేటట్లు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ ప్రాచీన జ్ఞానంలో ప్రస్తావించిన యోగా.. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఒక సమగ్ర విధానాన్ని సూచిస్తూస్వస్థతతో దీర్ఘ కాలం జీవించడానికి మనిషికి దన్నుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు’’ అని తెలిపింది.

 

***


(रिलीज़ आईडी: 2272873) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam