ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నూతన ఆవిష్కరణలలో, ఔత్సాహిక పారిశ్రామికత్వంలో వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని


చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 JUN 2026 8:55AM by PIB Hyderabad

నూతన ఆవిష్కరణలుఔత్సాహిక పారిశ్రామికత్వం.. ఈ రంగాల్లో ఉండే ప్రతి వ్యక్తికీ ఆలోచనా విధానం విభిన్నంగాప్రత్యేక సృజనాత్మక దృష్టికోణం ఉంటుందనీఇవి కొత్త అవకాశాలకు బాట వేస్తాయనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారునీరు అది పుట్టిన చోటును బట్టి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటున్నట్లేప్రతి ఒక్క ప్రతిభాశాలికీ తనదైన విశిష్ట గుర్తింపుతో పాటు తోడ్పాటు కూడా ఉంటుందని ఆయన తెలిపారువేర్వేరు ఆలోచనలసామర్థ్యాల కలయికతోనే నూతన ఆవిష్కరణపురోగతీ సాధ్యపడతాయని కూడా ప్రధానమంత్రి అన్నారు.   

సంస్కృత భాషలో ఉన్న ఓ సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకుంటూ:
‘‘
పిండే పిండే మతిర్భిన్నా కుండే కుండే నవం పయః
జాతౌ జాతౌ నవాచారాః నవా వాణీ ముఖే ముఖే’’ అని పేర్కొన్నారు.

నూతన ఆవిష్కరణల రంగంలోనూఔత్సాహిక పారిశ్రామికత్వ రంగంలోనూ ఉన్న ప్రతి వ్యక్తికీ వారు ఆలోచించే శైలి వేరుగా ఉంటుందిఆయా వ్యక్తులకు ఒక విశిష్ట సృజనాత్మక దృష్టి ఉంటుందిఈ వైవిధ్యమే నూతన అవకాశాలకు తావిస్తుందిఒక చోటులో పుట్టిన జలానికీమరో చోటులో పుట్టిన జలానికీ రుచిలో తేడాలు ఉంటున్న మాదిరిగానేప్రతి ఒక్క ప్రతిభాశాలికీ తనదైన గుర్తింపూతోడ్పాటూ ఉంటాయిఈ విభిన్న ఆలోచనలూసామర్థ్యాల మేలికలయికతో నూతన ఆవిష్కరణలూప్రగతీ సాధ్యపడతాయని పైన పేర్కొన్న సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
పిండే పిండే మతిర్భిన్నా కుండే కుండే నవం పయః
జాతౌ జాతౌ నవాచారాః నవా వాణీ ముఖే ముఖే’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2272868) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam