ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి నాణ్యమైన వైద్య సేవలు.. గత 12 ఏళ్ల కృషిని వివరించిన ప్రధానమంత్రి


ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. ఆరోగ్యకరమైన భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని

प्रविष्टि तिथि: 14 JUN 2026 1:27PM by PIB Hyderabad

నాణ్యమైన వైద్య సేవలను మరింత చౌకగాసులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి గత 12 ఏళ్లుగా భారత్‌ కృషి చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారుఅత్యంత నిరుపేదలకు సైతం అత్యుత్తమ నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ను కలిగిన దేశంగా గుర్తింపు పొందడం మనకెంతో గర్వకారణమని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన వంటి కార్యక్రమాల ద్వారా మందులను తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు శ్రీ మోదీ గుర్తుచేశారుస్టెంట్లుమోకాలి ఇంప్లాంట్ల ధరలు కూడా గణనీయంగా తగ్గి అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఎంతోమంది ప్రజలకు మేలు జరిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దేశంలో మరిన్ని వైద్య విద్యా సంస్థలు ఏర్పాటు కావడంసీట్లు పెరగడం వల్ల వైద్య విద్య కూడా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చిందని ప్రధాని శ్రీ మోదీ తెలిపారుఆరోగ్య రంగం సాధించిన ప్రగతి విశేషాలను పంచుకున్న ప్రధాని.. ఆరోగ్యకరమైన భారత్‌ నిర్మాణమే లక్ష్యంగా ఇప్పటివరకు సాధించిన విజయాలను మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘నాణ్యమైన వైద్య సేవలను మరింత చౌకగాఅందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి గత 12 ఏళ్లుగా భారత్‌ కృషి చేస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలుబలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయిఈ పథకం దేశానికి గర్వకారణంగా నిలిచింది.

 

ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఔషధి పరియోజన వంటి కార్యక్రమాల వల్ల మందులు చౌకగా లభిస్తున్నాయిస్టెంట్లుమోకాలి ఇంప్లాంట్ల ధరలు కూడా తగ్గడంతో అనేక మంది రోగులకు ప్రయోజనం కలిగింది.

 

వైద్య కళాశాలలుసీట్ల సంఖ్య పెరగడం వల్ల వైద్య విద్య కూడా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు సాధించిన ఈ పురోగతిని మరింత బలోపేతం చేస్తూ.ఆరోగ్యవంతమైన భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతాం.

‘‘స్వస్థ భారత్‌కు 12 సంవత్సరాలు’’   

 

‘‘వైద్య రంగ రూపురేఖలు ఎలా మారాయో తెలిపే కొన్ని ప్రగతి విశేషాలు...

‘‘స్వస్థ భారత్‌కు 12 సంవత్సరాలు’’

 

***


(रिलीज़ आईडी: 2272779) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam