ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో... బంగారం అక్రమ రవాణా ముఠాల ఆటకట్టించిన డీఆర్ఐ
రూ. 25 కోట్ల విలువైన సుమారు 17 కిలోల విదేశీ బంగారం స్వాధీనం
प्रविष्टि तिथि:
13 JUN 2026 7:59PM by PIB Hyderabad
వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోల్‌కతా, అగర్తలాలో పూర్తి సమన్వయంతో నిర్వహించిన భారీ ఆపరేషన్ ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సుమారు 17 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారుగా రూ. 25 కోట్లు. ఈ కేసుతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్టు చేశారు.
12.06.26న కోల్‌కతా విమానాశ్రయం ద్వారా థాయిలాండ్ నుంచి 11.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఒక స్మగ్లింగ్ ముఠాను డీఆర్ఐ పట్టుకుంది. ఈ కేసులో ఒక మహిళ సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 17 కోట్లుగా అంచనా.
అదే రోజు అగర్తలాలో... ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని త్రిపుర సెక్టార్ ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. 8 కోట్ల విలువైన 5.1 కిలోల విదేశీ బంగారాన్ని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. రైల్వే భద్రతా బలగాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
***
(रिलीज़ आईडी: 2272776)
आगंतुक पटल : 13