ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య ప్రాంతంలో అక్రమంగా రవాణా చేసిన రూ.14 కోట్ల విలువైన


71 లక్షల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. నలుగురు అరెస్టు

प्रविष्टि तिथि: 12 JUN 2026 4:04PM by PIB Hyderabad

విదేశీ సిగరెట్ల అక్రమ రవాణాపై నిఘాలో భాగంగా ఈశాన్య ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐఏకకాలంలో పలు దాడులను నిర్వహించింది.

ఈశాన్య ప్రాంతంలో మే 2026 నుంచి నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.14 కోట్ల విలువైన సుమారు 71 లక్షల విదేశీ సిగరెట్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుందిదీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.

 

జూన్ 11, 2026న నిర్వహించిన కీలక ఆపరేషన్ లో భాగంగా మిజోరాంలో మాండ్ఎక్స్ఎస్ఓఓరిస్పాట్రన్ వంటి బ్రాండ్లకు చెందిన 45 లక్షలకు పైగా విదేశీ సిగరెట్లను డీఆర్ఐ సీజ్ చేసింది. 34వ బెటాలియన్ అస్సాం రైఫిల్స్ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారుఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారుఈ సిగరెట్లను భారత్-మయన్మార్ సరిహద్దులోని జోఖౌథర్ సెక్టార్ ద్వారా దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

గత కొన్ని వారాలుగా జరిగిన వరుస ఆపరేషన్లలో మరో 26 లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకోగాముగ్గురు అరెస్టయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2272224) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil