ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైతుల సంక్షేమం, వ్యవసాయంలో ఆధునిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి సాధికారత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 JUN 2026 4:19PM by PIB Hyderabad

దేశ ఆహార భద్రత, పోషణ, సమృద్ధికి  మన రైతు సోదరీ, సోదరులు మూల స్తంభాలని, వారి జీవితాల్ని సులభతరంగా మార్చడానికి ప్రభుత్వం సర్వశక్తులతో ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టంచేశారు. ‘పీఎమ్-కిసాన్ సమ్మాన్ నిధి’, ‘ఫసల్ బీమా యోజన’ వంటి కార్యక్రమాలు రైతులకు ఆదాయ భద్రతను సమకూర్చడంతో పాటు, వ్యవసాయానికి సాధికారతను కూడా కల్పిస్తున్నాయని, ‘పీఎమ్-కుసుమ్ పథకం’ సౌర ఇంధనాన్ని సులభతరం చేస్తోందని, దీంతో వ్యవసాయానికి అయ్యే ఖర్చులు తగ్గుతున్నాయని ఆయన వివరించారు.
రైతులకు, పశువుల పెంపకందారులకు, మత్స్యకారులకు  కిసాన్ క్రెడిట్ కార్డు సులభంగా, తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తూ చాలా ప్రయోజనకారిగా ఉంటోందని శ్రీ మోదీ తెలిపారు. ‘విత్తనం నుంచి మార్కెట్టు వరకు’ కార్యక్రమం రైతులు పండించే పంటలకు న్యాయమైన ధరలు లభించేటట్లు చూస్తోందని ఆయన అన్నారు.
రైతుల సంక్షేమం అగ్ర ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఈ కారణంగానే వారికి ఆధునిక వ్యావసాయిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై నిరంతర శ్రద్ధ తీసుకొంటున్నారని ప్రధాని వివరించారు. డ్రోన్లు, భూసార కార్డులు, ప్రాకృతిక ఎరువులకు సంబంధించిన ప్రచార ఉద్యమాలు పంట ఉత్పాదకతను పెంచడంలో రైతులకు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఆయన ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలను  ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మన రైతు సోదరీ, సోదరులు దేశానికి ఆహార భద్రత, పోషణతో పాటు సమృద్ధికి కూడా మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. వారి జీవితాల్ని సాధ్యమైనంత ఎక్కువ సులభతరంగా మార్చడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పీఎమ్-కిసాన్ సమ్మాన్ నిధి, పంట బీమా పథకం వంటి అనేక కార్యక్రమాలు వారి ఆదాయానికి భద్రతను కల్పించడంతో పాటు, వ్యవసాయాన్ని ఇదివరకటి కన్న శక్తిమంతంగా మారుస్తున్నాయి. పీఎమ్-కుసుమ్ పథకం వ్యవసాయానికి గాను సౌర ఇంధనాన్ని సులభమైన పద్ధతిలో రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకంతో సాగుకు అయ్యే ఖర్చు కూడా తగ్గింది.
#12YearsOfKisanSamriddhi’’  

‘‘వ్యవసాయం సహా ఇతర అవసరాలను తీర్చుకోవడానికి తక్కువ వడ్డీ రుణాలను  సులభ పద్ధతిలో అందించడంలో కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు, పశువుల పెంపకందారులకు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతోంది. వారి పంటలకు తగిన ధర ఇప్పించడంలో ‘విత్తనం నుంచి మార్కెట్టు వరకూ’ అనే మా కార్యక్రమం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటోంది.
#12YearsOfKisanSamriddhi’’  
‘‘ రైతుల సంక్షేమం మా అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటి. ఈ కారణంగానే వారికి వ్యవసాయంతో ముడిపడిన ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై మేం నిరంతరం శ్రద్ధ వహిస్తున్నాం. డ్రోన్లు, సాయిల్ హెల్త్ కార్డులు, ప్రాకృతిక ఎరువులతో ముడిపడిన ప్రచార ఉద్యమాలతో పంట ఉత్పాదకతను పెంచుకోవడంలో  రైతులకు తోడ్పాటు లభిస్తోంది.

#12YearsOfKisanSamriddhi’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2271708) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada , Malayalam