ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆత్మీయ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 JUN 2026 9:11PM by PIB Hyderabad

తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారుభారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ప్రజల అపారమైన ఆశీస్సులుఅభిమానాల ఫలితమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అభివృద్ధి చెందినస్వయం సమృద్ధసంపన్న భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని మనమంతా మరింత దృఢ నిశ్చయంతో కలిసికట్టుగా ముందుకు తీసుకువెళదామని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"గౌరవనీయ ఓం బిర్లా గారూమీ హృదయపూర్వక శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలుభారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం దేశ ప్రజల అపారమైన ఆశీస్సులుఅభిమానాల ఫలితమేఅభివృద్ధి చెందినస్వయం సమృద్ధసుసంపన్న భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని మనం కలిసికట్టుగా మరింత దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకువెళ్దాం’’.

 

***
 


(रिलीज़ आईडी: 2271493) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam