సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024, 2025 సంవత్సరాలకు సంబంధించి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (అకాడమీ రత్న), సంగీత నాటక అకాడమీ అవార్డుల (అకాడమీ పురస్కారం), ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించిన సంగీత నాటక అకాడమీ

నాడు పోస్టు చేయడమైనది: 10 JUN 2026 9:09PM by PIB Hyderabad

ప్రదర్శన కళల రంగంలో ఏడుగురు ప్రముఖులను అకాడమీ ఫెలోస్‌గా (అకాడమీ రత్నఎంపికచేసినట్లు ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ (జాతీయ సంగీతనృత్యనాటక అకాడమీప్రకటించింది. 2026 మార్చి 22 నుంచి 26 వరకు దేశ రాజధానిలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారుఅకాడమీ ఫెలోషిప్ దేశంలోనే అత్యున్నతవిశిష్టమైన గౌరవంవీటి సంఖ్య గరిష్ఠంగా 40 మాత్రమే ఉంటుంది.

 

జనరల్ కౌన్సిల్ 2024, 2025 సంవత్సరాలకు గాను సంగీతంనృత్యంనాటకంసంప్రదాయజానపదగిరిజనసంగీతంనృత్యంనాటకంతోలుబొమ్మలాటప్రదర్శన కళలలో సమగ్ర సహకారంపరిశోధన తదితర రంగాల నుంచి 108 మంది కళాకారులను సంగీత నాటక అకాడమీ అవార్డులకు (అకాడమీ పురస్కారంఎంపిక చేసింది.

 

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ ఫెలోస్అవార్డు గ్రహీతలు మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారుఈ ప్రముఖ కళాకారులు సంగీతంనృత్యంనాటకంజానపదగిరిజన కళలుతోలుబొమ్మలాటవాటికి అనుబంధ రంగాలైన థియేటర్ ఆర్ట్స్ మొదలైన అన్ని రకాల ప్రదర్శన కళారూపాలకు చెందిన వారు.

 

అకాడమీకి చెందిన జనరల్ కౌన్సిల్ 2024, 2025 సంవత్సరాలకు గాను 106 మంది యువ కళాకారులను 'సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంకోసం ఎంపిక చేసిందిఈ పురస్కారాలను సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందిస్తారు.

 

ఈ అకాడమీ పురస్కారాలను 1952 నుంచి అందజేస్తున్నారుఈ గౌరవాలు అత్యున్నత స్థాయి నైపుణ్యంప్రతిభకు ప్రతీకలుగా నిలవడమే కాకుండా కళారంగంలో వ్యక్తుల నిరంతర కృషినివారి సమగ్ర సహకారాన్ని గుర్తిస్తాయిఅకాడమీ ఫెలో (అకాడమీ రత్నకింద రూ. 3,00,000, అకాడమీ అవార్డు కింద రూ. 1,00,000 నగదు బహుమతితో పాటు తామ్రపత్రంఅంగవస్త్రం అందజేస్తారు.

 

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం కింద రూ. 25,000 నగదు బహుమతితో పాటు తామ్రపత్రంఅంగవస్త్రం అందజేస్తారు.

సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లుఅవార్డులను భారత రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో అందిస్తారు.

***


(రిలీజ్ ఐడి: 2271489) సందర్శకుల సూచీ సంఖ్య : : 98
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Tamil , English , Urdu , हिन्दी