ఉప రాష్ట్రపతి సచివాలయం
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్రీ భారతిరాజా మృతికి సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
10 JUN 2026 1:41PM by PIB Hyderabad
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్రీ భారతిరాజా మృతికి ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ విచారాన్ని వ్యక్తం చేశారు.
గ్రామీణ భారతం ఆత్మను, మానవ భావోద్వేగాల తీవ్రతను అసాధారణ వాస్తవికతతో వెండి తెర మీద ఆవిష్కరించి, తమిళ చలనచిత్ర లోకంలో విప్లవాన్ని తీసుకువచ్చిన భారతిరాజా భావుకుడైన చలనచిత్ర కథన కళా స్రష్ట అని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
భారతిరాజా తనదైన చలనచిత్ర శైలితో, మరపురాని పాత్రలతో, కాలదోషం పట్టని చలన చిత్రాలతో భారతీయ చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేశారని, అనేక మంది చలనచిత్ర దర్శక నిర్మాతలకు, నటీనటులకు స్ఫూర్తిని అందించారని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారతిరాజా నిష్క్రమణ సినీ జగతికి పూడ్చలేని లోటు అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ దిగ్గజ దర్శకుడి కుటుంబానికి, మిత్రులకు, సహచరులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అసంఖ్యాక అభిమానులకు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సంతాపాన్ని తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2271099)
आगंतुक पटल : 26