ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని బాధితులకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 08 JUN 2026 7:32PM by PIB Hyderabad

విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారుఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారుస్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి రూ. 2 లక్షల చొప్పున అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారుగాయపడిన ప్రతి ఒక్కరికీ రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసిందిఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానుబాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు.

మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాంగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందిస్తాంప్రధాని”

***


(రిలీజ్ ఐడి: 2270596) సందర్శకుల సూచీ సంఖ్య : : 56