ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో మొక్కను నాటిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 JUN 2026 10:11PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొక్కను నాటారు. 

ప్రకృతిని పచ్చదనంతో నింపడానికి, రాబోయే తరాల కోసం దానిని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి మన ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో ఒక మొక్కను నాటే భాగ్యం కలిగింది. రండి.. మన ప్రకృతిని పచ్చదనంతో నింపడానికి, రాబోయే తరాల కోసం దానిని రక్షించడానికి మనమందరం కలిసికట్టుగా మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం."


(रिलीज़ आईडी: 2269926) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam