ప్రధాన మంత్రి కార్యాలయం
దమన్ నమో విమానాశ్రయంలోని అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 JUN 2026 10:18PM by PIB Hyderabad
కేంద్రపాలిత ప్రాంతమైన దమన్‌లోని నమో విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సాయంత్రం ప్రారంభించారు.
ఈ కొత్త సదుపాయం కేంద్రపాలిత ప్రాంతంలో పెరుగుతున్న మౌలిక వసతుల అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ టెర్మినల్ భవనం అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు కూడా భారీగా పుంజుకుంటాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘దమన్‌లోని నమో విమానాశ్రయానికి ఒక అత్యాధునిక టెర్మినల్ భవనం లభించింది. ఇది ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెరుగుతున్న మౌలిక వసతుల అవసరాలను తీరుస్తుంది. అలాగే ఇక్కడి పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ రోజు సాయంత్రం ఈ సరికొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’.
(रिलीज़ आईडी: 2269921)
आगंतुक पटल : 4