ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దమన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 JUN 2026 10:41PM by PIB Hyderabad

కేంద్రపాలిత ప్రాంతమైన దమన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, దేశ ప్రగతిపై  తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

 

‘‘దమన్‌లో లభించిన ప్రత్యేక స్వాగతంపై నేను ఎంతో సంతోషిస్తున్నాను. దమన్, డయ్యూ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం భారీగా నిధులను, వనరులను కేటాయించింది. ఇక్కడ చేపట్టిన వివిధ ప్రాజెక్టులు ప్రజల జీవన ప్రమాణాలను ఎంతో మెరుగుపరిచాయి’’

 

‘‘ఈ రోజు కార్యక్రమానికి ముందు దమన్ ప్రజలు చేపట్టిన అద్భుతమైన పారిశుధ్య కార్యక్రమాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పారిశుధ్యాన్ని పెంపొందించినప్పుడు.. అది ఆరోగ్య రంగం నుంచి పర్యాటక రంగం వరకు అనేక రంగాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

 

నేడు లభించిన స్వాగతానికి సంబంధించిన మరికొన్ని దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు’’

 

‘‘ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల కాలంలోనూ 140 కోట్ల మంది దేశ ప్రజల సమష్టి ప్రయత్నాల వల్ల భారత్‌ తనను తాను సుస్థిరంగా ఉంచుకోవడమే కాకుండా.. అగ్రగామిగా నిలవాలన్న తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి వేగాన్ని తెలియజేస్తూ నేడు విడుదలైన గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం’’

 

‘‘దాద్రా, నగర్ హవేలీతో పాటు దమన్‌ డయ్యూ ప్రాంతాల్లో అభివృద్ధికి అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఊహించే ప్రగతి కలలను సాకారం చేసేందుకు మన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది’’

 

‘‘ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్య రంగంలో మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయనడానికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం’’

 

‘‘దేశంలోని యువతకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తుకు సరైన దిశానిర్దేశం కూడా లభించాలన్నదే మన ప్రభుత్వ ప్రయత్నం. అందుకే ప్రతి రంగంలోనూ వారిని ఒక సరికొత్త దృక్పథంతో తీర్చిదిద్దుతున్నాం. దీనివల్ల మన స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయి’’.

***


(रिलीज़ आईडी: 2269918) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Tamil , Malayalam